రాజధాని అంశం రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. కానీ మీడియాకు అభిప్రాయాలు ఉండకూడదు. అన్ని అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. తమ అభిప్రాయాలను ఎడిటోరియల్ లో చెప్పవచ్చు. ప్రపంచానికి నీతులు చెప్పే తెలుగు మీడియా తాను మాత్రం అందుకు అతీతం అన్నట్లు వ్యవహారిస్తుంది. మూడు రాజధానుల ప్రతిపాదనను ముఖ్యమంత్రి చేసిన వెంటనే అమరావతి ప్రజలు ఆందోళన చేపట్టారు. వారి డిమాండుతో విభేదించే వారు కూడా వారి ప్రజాస్వామిక హక్కును కాదనలేరు.

మీడియా కూడా వారి ఆందోళనను ప్రపంచం ముందు ఉంచుతుంది. అంత వరకు బాగానే ఉంది. కానీ రాష్ట్రంలో భాగమైన రాయలసీమ ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అందుకు మంచి ఉదాహరణ వెలుగులోకి రాని సీమలోని ఆందోళన కార్యక్రమాలు.  కడప కేంద్రంగా నాలుగు రాయలసీమ జిల్లాల ప్రజలు వందల మంది పార్టీల కతీతంగా ముఖ్యమంత్రి ప్రతిపాదనలో రాయలసీమకు సమన్యాయం కావాలని సీమ సంకల్ప దీక్ష చేస్తున్నారు. కానీ ఒక్క మీడియా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రధాన అంశంగా చర్చ చేయలేదు.

మెరుగైన ప్రజాస్వామ్యం కోసం రాయలసీమ వాదులందురు చేయి చేయి కలపాలి. ఈ ప్రాంత అభివృద్ధికి తగిన రాజకీయ ప్రాధాన్యత కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అదే విధంగా చట్ట సభల్లో ప్రాతినిధ్యం లేని వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పించవలసిన బాధ్యత అన్ని ప్రధాన రాజకీయ పార్టీలపై ఉందన్నారు. దీనిని సాంప్రదాయ పార్టీలు, వారసత్వ పార్టీలు, అవినీతి పార్టీలు, అగ్రకుల పార్టీలు విస్మరించడం శోచనీయం అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70సంవత్సరాలు దాటినప్పటికీ మెజారిటీ వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బిసిలకు రాజకీయ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. 

అన్యాయం ఏమిటంటే రాయలసీమలొనే అమరావతికి అనుకూలంగా చేసే కార్యక్రమాలకు మాత్రం మంచి ప్రాధాన్యత ఇచ్చినారు. ఆంద్రప్రదేశ్ లో ఉన్నది తెలుగు ప్రజల మీడియానా ? అమరావతి మీడియానా ? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామ క్రమంలో రాయలసీమ ప్రజల సంకల్ప దీక్షకు కనీస ప్రాధాన్యత ఇవ్వని మీడియా సవితి ప్రేమను నిరశిస్తున్నానంటూ సోషల్ మీడియాలో ప్రత్యేక కధనాలు వైరల్ అవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: