బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఎదిగేందుకు సిద్ధం అవుతున్నది.  ఏపీ లో ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.  ఈ పొత్తులో భాగంగానే వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.  ఎన్నికల్లో పోటీతో పాటుగా రైతుల సమస్యలపై కూడా పోరాటం చేయబోతున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడానికి అన్నిరకాల ఎత్తులు వేస్తున్నారు.  ముఖ్యంగా బీజేపీ ఇప్పుడు కోస్తాపై దృష్టిపెట్టింది.  అక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి బలం ఉన్నది.  కోస్తాలో బలమైన నాయకుడిగా ముద్రగడకు పేరు ఉన్నది.  

 

ఆయన్ను ఇప్పుడు బీజేపీలోకి ఆహ్వానించేందుకు రెడీ అవుతున్నారు.  బీజేపీలో జాయిన్ అయ్యేందుకు కూడా ముద్రగడ ఆసక్తిగానే ఉన్నారు.  అయితే, ఇక్కడ ఓ కండిషన్ ఉన్నది.  గతంలో కాపులకు 5శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు.  ఈ హామీకి కట్టుబడి రిజర్వేషన్ కల్పించేందుకు సిద్ధమైతే, ముద్రగడ బీజేపీలో జాయిన్ కావడానికి సిద్ధం అని అంటున్నారు.  కానీ, బీజేపీ అందుకు అనుకూలంగా ఉంటుందా అన్నది చూడాలి.  

 

సాధారణంగా బీజేపీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఉండదు.  మరి అలాంటప్పుడు ఎలా ముద్రగడకు హామీ ఇస్తుంది అన్నది చూడాలి.  ముద్రగడకు హామీ ఇస్తే తప్పకుండా అమలు చేయాలి.  అలా అమలు చేయడానికి సిద్ధం అని చేప్తే అయన బీజేపీలో జాయిన్ అవుతాడు.  అది బీజేపీకి బలం చేకూరినట్టు అవుతుంది.  అటు పవన్ కళ్యాణ్ కూడా కోస్తాలో పాగా వేయడానికి సిద్ధం అవుతున్నారు.  గత ఎన్నికల్లో కోస్తా, విశాఖ నుంచి పోటీ చేసినా ఓడిపోయారు.  రూపాయి కూడా డబ్బును పంచకుండా ఉన్నారు కాబట్టి ఓటమిపాలయ్యారు.  

 

ముద్రగడతో పాటుగా అటు రాయలసీమ నుంచి మరోనేత కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు.  ఆయనెవరో కాదు మైసూరా రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ గా ఉన్నారు.  అయన చూపులు ఇప్పుడు బీజేపీ వైపు ఉన్నాయి.  త్వరలోనే అయన కూడా బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  రాయలసీమ నుంచి మైసూరా, కోస్తా నుంచి ముద్రగడ బీజేపీలో జాయిన్ అయితే, ఆ పార్టీకి కొండంత బలం చేకూరినట్టే అని చెప్పాలి.  ఎలాగో పవన్ చరిష్మ ఉండనే ఉన్నది.  మరి బీజేపీ వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: