బ‌తికుండ‌గా నిన్ను ఏడిపించినోళ్లు.. చ‌చ్చాక ఏడుస్తారు.. దొంగ‌నాయాళ్లు! అన్న సినీ క‌వి మాట‌ల‌ను టీడీపీ నాయ‌కులు, ఆ పార్టీ క‌ర‌ప‌త్రిక ఈనాడు అక్ష‌రాలా నిజం చేస్తున్నాయి. అది కూడా టీడీపీ వ్య‌వ‌స్తాప‌క అధ్య‌క్షు డు ఎన్టీఆర్ విష‌యంలో కావ‌డం గ‌మ‌నార్హం. ఎన్టీఆర్ జీవించిన స‌మ‌యంలో, ముఖ్యంగా ల‌క్ష్మీపార్వ‌తి ఆ యన జీవితంలో ఎంట‌ర్ అయిన త‌ర్వాత‌.. ఈనాడు కానీ, టీడీపీలో చంద్ర‌బాబు వంటి ద్వితీయ శ్రేణి నాయ కులు కానీ ఎన్టీఆర్‌ను ఎలా ట్రీట్ చేశారో.. నేటి కాలం టీడీపీ శ్రేణులకు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ, వాస్త‌వాలు మాత్రం ఎప్ప‌టికీ దాగ‌వు!

 

నాడు ఎన్టీఆర్ విష‌యంలో టీడీపీ క‌ర‌ప‌త్రిక‌గా పేరున్న ఈనాడు ఇష్టానుసారంగా వార్త‌లు రాసేద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అడుగ‌డుగునా ఆయ‌న‌ను అవ‌మానిస్తూ.. అన్ని విధాలా ప‌రువు తీసే ప్ర‌య త్నం చేశారు. ఈ క్ర‌మంలోనే ఒక‌నాడు ఈనాడులో వ‌చ్చిన కార్టూన్ ఇప్ప‌టికీ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ``రోజులో ఒక గంట మాత్ర‌మే ఆలోచిస్తా``-అని వ్యాఖ్యానించిన ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ.. ఈనాడులో కార్టూన్ వ‌చ్చిం ది. దీనిలో ఆయ‌న‌ను తీవ్రంగా భ్ర‌ష్టు ప‌ట్టించేశారు. ఎన్టీఆర్‌కు మ‌తి లేద‌ని, ఆయ‌న బుర్ర ఏమాత్రం ప‌నిచేయ‌ద‌ని.. ప్రొజెక్ట్ చేశారు.

 

మ‌రి అలాంటి ఎన్టీఆర్‌కు ఇప్పుడు అంటే ఆయ‌న చ‌నిపోయిన 24 ఏళ్ల‌కు మాత్రం పూల‌దండ‌లేసేసి.. నివాళులు అర్పించేయ‌డం టీడీపీకి ఆన‌వాయితీగా మారిపోయింది. అప్ప‌ట్లో మ‌తిలేని ఎన్టీఆర్.. బుర్ర‌లేని ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం దేవుడు, రాముడు అయిపోయాడు. అదేస‌మ‌యంలో ఎన్టీఆర్‌ను ఓ బ‌ఫూన్‌గా చూపించి న ఈనాడు అన్నా ఇప్ప‌టి టీడీపీకి ఎంత మక్కువో..! 

 

నాడు బాబోరి డైరెక్ష‌న్‌లో ఎన్టీఆర్‌ను బ‌ద్నాం చేసేందుకు ఈనాడు ఆడిన గేమ్ ఆడ‌గా నేడు అదే ఈనాడు ఎన్టీఆర్‌ను వీలున్న‌ప్పుడల్లా కీర్తిస్తూనే ఉంటుంది. ఇక బుర్ర‌లేనివాడు, బుద్ధిలేకుండా ఫ్యాంటు పైన‌, చొక్కా కింద క‌ట్టుకునే ఎన్టీఆర్ యుగ‌పురుషుడు ఎలా అయ్యాడో.. అని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనికి టీడీపీ నాయ‌కులు ఏం స‌మాధానం చెబుతారో?! ఏదేమైనా చ‌నిపోయాక పొగ‌డ్డం అంటే ఇదేనేమో..!

మరింత సమాచారం తెలుసుకోండి: