టీడీపీ త‌ర‌ఫున గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి.. త‌ర్వాత ఆ పార్టీకి రెబ‌ల్‌గా మారిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల విష‌యం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది.రాజ‌ధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల‌కు చెందిన ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు టీడీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. వారే.. ఒక‌రు గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వంశీ మో హ‌న్‌, మ‌రొక‌రు గుంటూరు జిల్లా వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి. ఈ ఇద్ద‌రిలో వంశీ 2014లోనూ టీడీపీ టికెట్‌పై విజయం సాధించారు. గిరి అప్ప‌టి ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో మాత్రం విజ‌యం సాధించారు.

 

అయితే, ఈ ఇద్ద‌రూ ఇప్పుడు టీడీపీకి రెబ‌ల్‌గా మారిపోయారు. వంశీ ఎన్నిక‌ల త‌ర్వాత రోజు నుంచే టీడీపీ కి దూర‌మ‌వుతార‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఆయ‌న క్లారిటీ ఇచ్చేందుకు నాలుగు మాసాల స‌మ‌యం ప‌ట్టింది. చంద్ర‌బాబు ఇసుక దీక్ష పేరుతో హ‌డావుడి చేసిన స‌మ‌యంలోవంశీ ఆ పార్టీకి దూర‌మ‌వుతున్నా న‌ని ప్ర‌క‌టిం చారు. అదేస‌మ‌యంలో వైసీపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇక‌, మ‌ద్దాలి గిరి నెల రోజుల కింద‌ట వైసీపీకి జైకొట్టా రు. నిజానికి రాజ‌ధాని పోరు చేస్తున్న చంద్ర‌బాబుకు మ‌ద్దాలి గిరి పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌డం తీవ్ర ఇ బ్బంది క‌లిగించింది.

 

అయితే ఈ ఇద్ద‌రిపైనా చంద్ర‌బాబు పార్టీ ప‌క్షాన ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేదు. అయితే, వంశీ, గిరిలు ఇద్ద‌రూ కూడా పార్టీకి దూరంగానే ఉన్నారు త‌ప్ప పార్టీకి కానీ, త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వు లకు కానీ రాజీనామాలు చేసింది లేదు. దీంతో టెక్నిక‌ల్‌గా వారు టీడీపీ ఎమ్మెల్యేలుగానే చ‌లామ‌ణి అవు తున్నారు. దీంతో చంద్ర‌బాబు తాజాగా మూడు రాజ‌ధానుల విష‌యంపై సోమ‌వారం నాటి అసెంబ్లీలో చ ర్చ జ‌రిగి.. అనంత‌రం ఓటింగ్ నిర్వ‌హిస్తే.. త‌మ పార్టీ విధానానికి అనుకూలంగా ఓటు వేయాలని ఆదేశి స్తూ.. ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు విప్ జారీ చేశారు.

 

వాస్త‌వానికి విప్ అంటే.. అంద‌రికీ జారీ చేయాల్సి  ఉంది. కానీ, చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ఈ ఇద్ద‌రికే ఇచ్చారు. అయినా కూడా విప్ విప్పే క‌నుక దీనిని ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు అనుస‌రించాలి. అయితే, వారు ఓటు వేస్తా రా?  వేయ‌రా?  అనేది సందేహంగా మారింది. ఒక‌వేళ ఏదైనా చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తే.. మ‌ళ్లీ స్పీకర్‌కే ఈ కేసును రిఫ‌ర్ చేయాల్సి ఉంటుంది. అంటే.. అంతిమంగా.. ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌ను అడ్డు పెట్టుకుని చంద్ర‌బాబు మ‌ళ్లీ రాజ‌కీయాల‌కు తెర‌దీశార‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: