రాజకీయాలు ఎక్కువ శాతం కులాల ఆధారంగానే నడుస్తాయనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలు కులం అనే పడవలోనే పయనిస్తాయి. అందులోనూ కమ్మ, రెడ్డి సామాజికవర్గాల మధ్యే రాజకీయ ఫైట్ నడుస్తుందనేది బహిరంగ రహస్యమే. ఇక ఈ రెండు సామాజికవర్గాలు ఏ పార్టీలు వైపు ఉన్నాయో చెప్పనవసరం లేదు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ కుల పాలన ఎక్కువగా ఉండేది. కానీ తొలిసారి సీఎం అయిన జగన్ పాలనలో అదేమీ కనబడటం లేదు.

 

ఎందుకంటే జగన్ అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా పాలన చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఇందులో పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా ముందుకెళుతున్నారు. అయితే ఇంత చేస్తున్న టీడీపీ మాత్రం క్యాస్ట్ పాలిటిక్స్ వదలడం లేదు. జగన్‌కు ఏదొకవిధంగా కుల ముద్రవేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే అభివృద్ధి కోసం మూడు రాజధానులని తీసుకొస్తే, ఒక సామాజికవర్గం మీద కోపంతోనే అమరావతి నుంచి రాజధాని తరలించుకుని వెళ్లిపోతున్నారని బాబు విష ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ బాబు చెప్పే సామాజికవర్గం కమ్మ.

 

ఇక బాబు చేసే విష ప్రచారాన్ని గమనించిన మంత్రి కన్నబాబు తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులని సమర్ధిస్తూ మాట్లాడుతున్న తరుణంలో కమ్మ వర్గంపై జగన్‌కు కోపం లేదని, కమ్మ వర్గానికి జగన్‌పై ప్రేమ ఉందని, ఆ విషయం మంత్రి కొడాలి నానిని చూస్తే అర్ధమవుతుందని చెప్పారు. కన్నబాబు చెప్పిన విధంగా చూసుకుంటే అది నిజమే అని చాలా సందర్భాల్లో రుజువైంది. అయితే వైసీపీలో ఉన్న కమ్మ ప్రజాప్రతినిధులు జగన్‌పై ఎక్కువ అభిమానం చూపిస్తారు.

 

కేవలం కొడాలి నానినే కాకుండా, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరీ, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో సహ మిగిలిన కమ్మ నేతలు జగన్‌తో ప్రేమగా ఉంటారు. ఏదో బాబు చేసే విష ప్రచారం తప్ప, జగన్‌కు కమ్మ సామాజికవర్గంపై ఎలాంటి కోపం లేదని వీరిని చూస్తే అర్ధమవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: