సాధారణంగా రాజకీయాల్లో అవసరాలు ఉంటాయి. ఇక అందుకు తగ్గట్టుగా నేతలు కూడా నడుస్తారు. అయితే అవసరాల కోసం రాజకీయాలు చేసే వాళ్ళు అరుదుగా ఉంటారు. అందులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందుంటారు. ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు. ఆయన అవసరాల కోసం ఎంతమంది నాయకుల రాజకీయ భవిష్యత్తుకు ఫుల్ స్టాప్ పెట్టారో కూడా తెలుసు. అందులో సొంత పార్టీ నేతలు చాలామంది ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బాబు....ప్రస్తుతం కొందరు టీడీపీ నేతల రాజకీయ భవిష్యత్తుకు ఎండ్ కార్డ్ పెట్టేశారు.

 

అది కూడా ఆయన అవసరం కోసం, నేతలకి ఇష్టం లేకపోయిన బలవంతంగా ఎంపీలుగా పోటీ చేయించి వారిని నిలువునా ముంచేశారు. అలా మునిగిపోయిన నేతల్లో ముందు వరుసలో ఉండేది వేటుకూరి శివరామరాజు(కలవపూడి శివ). పార్టీలకి అతీతంగా మంచి పేరున్న శివ...రెండు సార్లు టీడీపీ తరుపున ఉండి ఎమ్మెల్యేగా గెలుపొంది, అక్కడి ప్రజలకు సేవ చేశారు. అయితే 2019 ఎన్నికలకొచ్చేసరికి బాబు...ప్లాన్ చేంజ్ చేసి శివకు ఇష్టం లేకపోయిన నరసాపురం పార్లమెంట్ బరిలో దింపారు. ఆ ఎన్నికల్లో శివ...వైసీపీ అభ్యర్ధి రఘురామకృష్ణం రాజు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక ఓడిన దగ్గర నుంచి శివ అడ్రెస్ లేరు. రానున్న రోజుల్లో ఆయన పరిస్తితి ఏంటనేది కూడా అర్ధం కాకుండా ఉంది.

 

ఇలాగే 2014లో దర్శి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బాబు మంత్రివర్గంలో పని చేసిన శిద్ధా రాఘవరావుని....2019లో ఒంగోలు ఎంపీగా పోటీ చేయించారు. ఇక వైసీపీ గాలిలో శిద్ధా ఓడిపోయారు. అటు దర్శిలో కూడా టీడీపీ అభ్యర్ధి ఓడిపోయారు. శిద్ధా కూడా ఓడిపోయాక కనబడటం లేదు. ఇదే మాదిరిగా 2014లో చిత్తూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సత్యప్రభని 2019లో రాజంపేట ఎంపీగా బరిలో దింపారు. ఆమె కూడా మిథున్ రెడ్డి చేతిలో ఓడిపోయింది. అటు చిత్తూరు టీడీపీ అభ్యర్ధి కూడా ఓడిపోయారు.

 

ఇక ఇలాగే కావలి అసెంబ్లీలో పోటీ చేయాల్సిన బీదా మస్తాన్ రావు నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోగా, జమ్మలమడుగులో పోటీ చేయాల్సిన ఆది నారాయణరెడ్డి కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే వీరిద్దరు ముందే తేరుకున్నారు. ఇందులో బీదా వైసీపీలోకి, ఆదినారాయణ బీజేపీలోకి వెళ్ళి తమ రాజకీయ భవిష్యత్తుని కాపాడుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: