సాధారణంగా నేతలు రాజకీయాల్లో రాంగ్ స్టెప్పులు వేయడం సహజం. టెంపరరీగా ఉండే అధికారం కోసం, పర్మినెంట్‌గా అండగా ఉండే పార్టీని వదిలేస్తారు. అయితే చివరికి చేసిన తప్పు తెలుసుకుని సొంత గూటికి రావడానికి తెగ కష్టపడతారు. ఇప్పుడు ఇదే పరిస్థితిని టీడీపీలో ఉన్న మాజీ వైసీపీ నేతలు ఫేస్ చేస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ వేసిన వలకు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి వచ్చిన విషయం తెలిసిందే. ఇక టీడీపీలోకి వచ్చిన 23 మంది ఎమ్మెల్యేల్లో 2019 జరిగిన ఎన్నికల్లో ఒక్కరు అంటే ఒక్కరే గెలిచారు. అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించారు. మిగతా వారంతా దారుణమైన ఓటమికి గురయ్యారు.

 

పైగా వైసీపీ అదిరిపోయే మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో చాలామంది జంపింగ్ నేతలు తెగ బాధపడిపోతున్నారు. టీడీపీలో రాజకీయ భవిష్యత్త్ కనపడటం లేదు. వైసీపీని వీడి తప్పు చేశామే, అక్కడే ఉంటే మంచి పదవులు కూడా వచ్చేవి అని ఆవేదన పడిపోతున్నారు. సరే ఇప్పుడుకైనా పోయేది ఏమి లేదు. వైసీపీలోకి వెళితే ఏదొక గౌరవం అయిన దక్కుతుందని, ఆ మాజీ ఎమ్మెల్యేలు జగన్ చెంతకు చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

అయితే తాజాగా మూడు రాజధానులు వచ్చాక, విశాఖపట్నంలోని నేతలు బాగా ట్రైల్స్ వేస్తున్నట్లు తెలిసింది. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానుండటం, దీనికి టీడీపీ వ్యతిరేకంగా ఉండటం వల్ల కొందరు వైసీపీకి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా  పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఫ్యాన్ కిందకు వెళ్లాలని చూస్తున్నారు. ఈశ్వరి 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి పాడేరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళి 2019లో ఘోరంగా ఓడిపోయారు. ఇక ఓడిన దగ్గర నుంచి పార్టీకు దూరంగా ఉంటున్న ఆమె వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

 

అటు అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కూడా తిరిగి సొంత గూటికి వెళ్లాలని చూస్తున్నట్లు సమాచారం. 2014లో వైసీపీ తరుపున రంపచోడవరం ఎమ్మెల్యేగా గెలిచిన రాజేశ్వరి ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళి 2019 ఎన్నికల్లో దారుణ ఓటమి చవిచూశారు. ఇప్పుడు ఈమె కూడా ఫ్యాన్ కిందే సేద తీరాలని అనుకుంటుంది. వీరితో పాటు ద్వితీయ శ్రేణి నేతలు కూడా వైసీపీ కండువా కప్పుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి వీరు ఫ్యాన్ కిందకు ఎప్పుడు వస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి: