ఏపీ సీఎం జగన్ సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు. దేశంలో సంక్షేమ పథకాల అమలులో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అభివృద్ధి అంటే ఆదాయాల లెక్కలు కాదని.. సామాజిక ప్రగతి అని నిరూపిస్తున్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలు ఆనందంగా ఉన్నప్పుడే అసలైన అభివృద్ధి అని నిరూపిస్తున్నారు. తాజాగా అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం వంటి పథకాల ద్వారా దేశంలోనే ఇంత వరకూ ఎవరూ చేయని సాహసం చేసిన సీఎంగా రికార్డులకు ఎక్కుతున్నారు జగన్.

 

విద్య విషయంలో సీఎం జగన్ చాలా పట్టుదలగా ఉన్నారు. అమ్మ ఒడి ఒక గొప్ప కార్యక్రమం ఇంత వరకు దేశ చరిత్రలో జరగని కార్యక్రమం. రాష్ట్రంలో తొలి సారి జరుగుతున్న కార్యక్రమం. పిల్లలకు మంచి చదువులు అందించాలంటే అడుగులు ఎలా వేయాలన్న చర్చ జరుగుతోంది. ఏపీలో నిరాక్షరాస్యత 33 శాతం ఉంది. దేశంతో పోల్చితే 27 శాతం ఉంది. దేశం కన్న దారుణంగా ఏపీ రాష్ట్రంలో చదువు రాని వారు ఎక్కువగా ఉన్నారు. కాలేజీల విషయం పరిశీలిస్తే.. జీఈఆర్‌ రేషియే చూస్తే 23 శాతమే చదువులు కొనసాగిస్తున్నారు.

 

ఇది మారాలంటే పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఏకైక ఆస్తి చదువు. ఈ ఆస్తి అన్నది క్వాలిటీలో కూడినది ఇవ్వాలి. విద్యారంగంలో గొప్ప మార్పులు తీసుకువచ్చేందుకు వైఎస్ సర్కారు నాలుగు అడుగులు వేసింది. మొదటి అడుగు అమ్మ ఒడి. దాదాపుగా 82 లక్షల పిల్లల భవిష్యత్‌ మార్చేందుకు, ఆ పిల్లలకు చదువులకు ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో అమ్మ ఒడి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. 42,33, 908మంది తల్లులకు మేలు చేసే కార్యక్రమం చేపట్టారు. అక్షరాల రూ.6028 కోట్లు ఒకేసారి ఆ తల్లుల అకౌంట్లలో జమా చేశారు.

 

ఇలాంటి కార్యక్రమం దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. కేవలం నాలుగు, ఐదు రోజుల్లోనే డబ్బులు జమా చేశారు. కొన్ని కారణాల వల్ల 2 లక్షల మంది తల్లులకు ఆలస్యమైంది. ఈ రోజు మరో ఒక లక్ష మంది తల్లులకు జమా చేశారు. వారం రోజుల్లో టెక్నికల్‌ సమస్యలు తొలగించి అందరికి డబ్బులు జమా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తల్లులను చైతన్యవంతం చేస్తూ వ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా జగన్ ఈ విషయంలో గ్రేట్.

మరింత సమాచారం తెలుసుకోండి: