ధనం ఒక సాధనంగా పరిగణించే వ్యక్తిదగ్గర మాత్రమే ఐశ్వర్యం చేరుతుంది. వాస్తవానికి మనిషి జీవన ప్రస్థానం అంతా డబ్బుతో ముడిపడి ఉన్నా ఆ డబ్బుకు మించిన రకరకాల బంధాలు అనుబంధాల సక్రమంగా ఉన్న వ్యక్తి దగ్గరే డబ్బు వచ్చి చేరుతుంది. ప్రస్తుత సమాజంలో రకరకాల భావావేశాలు వ్యక్తిత్వాలు ఉన్న వ్యక్తుల సమూహం ఎక్కువై పోవడంతో ఎంత దగ్గరవారి మధ్య అయినా గ్యాప్ ఏర్పడుతోంది.

దీనితో వ్యక్తుల మధ్య మానవ సంబంధాల పాత్ర కీలకంగా మారడంతో ఈ మానవ సంబంధాలలో రాణించిన వ్యక్తికి మాత్రమే విజయం లభించి తద్వారా ఆ విజయంతో ఐశ్వర్యం చేతికి అందుతుంది. వాస్తవానికి ఏమనిషి చెడ్డవాడుగా పుట్టడు. ఆ మనిషి పెరిగిన వాతావరణం జీవితంలో ఎదురైనా పరిస్థితులు ఒక వ్యక్తిని మంచి వాడిగా అదేవిధంగా చెడ్డ వాడిగా మారుస్తాయి కాని ఏ వ్యక్తి పుట్టుకతోనే దుర్మార్గుడుగా పుట్టడని మనస్థత్వ శాస్త్రజ్ఞుల అభిప్రాయం.

నరరూప రాక్షసుడుగా పేరు గాంచిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కొందరితో చాల మంచిగా వ్యవహరించాడు అన్న విషయం తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు. ‘మనుషులతో వ్యవహరించడం అనేది గని లోంచి బంగారం తీయడం అన్నంత కష్టం అని’ ప్రపంచ ప్రఖ్యాత ఉక్కు పారిశ్రామిక వేత్త ఆండ్రూ కార్నెగి తన స్వీయ చరిత్రలో రాసుకున్నాడు. అంతేకాదు తాను అందరితోను మంచిగా వ్యవహరించడం వలెనే ప్రపంచ స్థాయిలో పేరు పొందిన ధనవంతుడుగా మారానని ఆండ్రూ కార్నెగి అభిప్రాయం.

ఏ వ్యక్తి ఎదుగదల అయినా అతడు నలుగురికి పంచే మంచితనం మీద ఆధారపడి ఉంటుందని మంచితనం ఎప్పుడు బ్యాంక్ లో దాచుకున్న డబ్బు కన్నా ఎక్కువ అని డబ్బు అవసరానికి ఆదుకున్నట్లే మంచితనం మనిషి విజయానికి ఆసరాగా నిలిచి కష్టాల నుండి గట్టెక్కిస్తుందని అంటారు. అందువల్లనే ప్రాధమికంగా కృషితో పాటు మంచితనం ఉన్న వ్యక్తులు మాత్రమే విజేతలుగా మారి ఐశ్వర్య వంతుడు కాగలడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: