ప్రపంచంలో ఉగ్రవాదుల ఉగ్ర చర్యలు ఏ మాత్రం ఆగడం లేదు.  రోజు రోజుకు తీవ్రతరం చేస్తున్నారు.  ప్రపంచంలో ప్రతిరోజూ ఎదో ఒక ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.  అలజడులు సృష్టిస్తున్నారు.  ఈ అలజడుల నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.  ముఖ్యంగా ఇస్లామిక్ ఉగ్రవాదులు ఉగ్రపంజా విసురుతున్నారు.  ఐసిస్ ఉగ్రవాదులు చేస్తున్న రగడలో ఆఫ్రికా దేశాలు అతలాకుతలం అవుతున్నాయి.  


ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో నిత్యం ఐసిస్ ఉగ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు.  ఈ దాడుల్లో సామాన్య ప్రజలు బలిపశువులుగా మారుతున్నారు.  ఇప్పటికే అక్కడ లక్షలాది మంది పౌరులు ఈ దాడుల వలన మరణించారు.  తాజాగా ఇప్పుడు మరోదాడి జరిగింది.  నగ్రావోగో ప్రాంతంలోని ఓ మార్కెట్‌పై దాడి జరిపి... తగలబెట్టడం ద్వారా ముష్కరులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అనంతరం పక్కనే ఉన్న గ్రామంలోకి వెళ్లి మరో నలుగురిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మొత్తం 36 మందిని పొట్టనబెట్టుకున్నారు. 


గత నెలలో కూడా ఇలాంటి దాడే జరిగింది.  కాగా, బుర్కినాఫెసో సైన్యానికి ఫ్రాన్స్, అమెరికా సైన్యం శిక్షణ ఇస్తోంది.  సైన్యం శిక్ష ఇస్తూ ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తున్నది.  ఉగ్రవాద శిబిరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటోంది.  ఇక ఇదిలా ఉంటె, బుర్కినా ఫెసో పార్లమెంట్ ఓ నిర్ణయం తీసుకుంది.  


గ్రామాల్లోని యువకులను ప్రోత్సహించి, అర్హులైన యువకులకు శిక్షణ ఇచ్చి ఆయుధాలు ఇచ్చి ఉగ్రవాదులపై పోరాటం చేసేందుకు అవసరమైన బిల్లును పార్లమెంట్ ఆమోదం తెలిపింది.  ఈ బిల్లు ఆమోదంతో అక్కడ ప్రజలకు కొంత ఊరట లభించింది.  ఉగ్రవాదులను ఏరివేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.  మరి చూడాలి ఏమౌతుందో.   సిరియా దేశంలో ఐసిస్ ను అరికడితే... ఇప్పుడు ఇప్పుడు ఐసిస్ ఉగ్రవాదులు ఆఫ్రికా దేశాలపై కన్నేశారు.  అక్కడ అరాచకాలు సృష్టిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: