రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం జగన్ తీసుకున్న సంచలనం నిర్ణయం మూడు రాజధానులు. కేవలం అభివృద్ధి ఒకే ప్రాంతంలో ఉండకూడదనే ఉద్దేశంతో జగన్....రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని విశాఖని ఎగ్జిక్యూటివ్, కర్నూలుని జ్యూడిషయల్, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక అతి త్వరలోనే ఈ నిర్ణయం అమలు కానుంది. ఈ నిర్ణయానికి అన్ని ప్రాంత ప్రజలు కూడా ఆమోదం తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మొత్తం పాలన అక్కడ నుంచే జరగనుండటంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

అయితే ఇదే సమయంలో మొన్నటివరకు టీడీపీకి అనుకూలంగా ఉన్న నగర ప్రజలు ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్ణయంతో వైసీపీకి మద్ధతు తెలుపుతున్నారు. ఈ విషయం కూడా త్వరలోనే తెలియనుంది. ఎందుకంటే త్వరలోనే విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. కాసేపు ఈ ఎన్నికల విషయం పక్కనబెట్టేస్తే...విశాఖపట్నం ఎక్కువగా టీడీపీకి ఫేవర్‌గా ఉంటుంది. 2014లో ఆ పార్టీ ఇక్కడ భారీగానే సీట్లు దక్కించుకుంది. పైగా ఇటు విశాఖ ఎంపీగా పోటీ చేసిన విజయమ్మ కూడా ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచి కసిగా పని చేస్తున్న జగన్...2019 ఎన్నికల్లో అద్భుత విజయం అందుకున్నారు. జిల్లాలో ఉన్న విశాఖతో సహ మిగిలిన రెండు ఎంపీ స్థానాలని గెలుచుకున్నారు.

 

అలాగే 15 అసెంబ్లీ సీట్లలో 11 సీట్లు గెలుచుకున్నారు. అయితే విశాఖ నగరంలో ఉన్న 4 సీట్లని మాత్రం కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం జగన్ హవా నడిచిన విశాఖ సిటీలో మాత్రం టీడీపీ హవా నడిచింది. అయితే ఈహవా ఎక్కువ కాలం కొనసాగకుండా జగన్ గట్టి దెబ్బ వేశారు. ఒక్కసారిగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడంతో నగర ప్రజలు వైసీపీకి అనుకూలంగా వచ్చేశారు. ఇక వారు ఎంత అనుకూలంగా ఉన్నారనేది త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నిలల్లో తేలిపోనుంది. మొత్తానికైతే జగన్ విశాఖపై పట్టు సాధించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: