గడ్డి వాము దగ్గర కుక్క.. అనే సామెత విన్నారా.. దాని అర్థం తెలుసా మీకు.. తెలియకపోతే.. చెబుతా వినండి.. గడ్డివాము దగ్గర ఓ కుక్క ఉంటుంది. అది ఆ గడ్డి తినేందుకు వచ్చే ఆవులు, గేదెలను అది భౌభా అంటూ మొరుగుతుంది. దీంతో ఆ పశువులు ఆ గడ్డి తినలేకపోతాయి. పోనీ.. కుక్క ఆ గడ్డి తింటుందా.. అంటే అదీ లేదు. కుక్క నాన్ వెజ్ తింటుంది కానీ.. అలాంటి గడ్డి తినదు. అంటే ఇప్పుడు అర్థమయ్యిందిగా.. గడ్డివాము దగ్గర కుక్క అంటే ఏంటో.. తను తినదు.. ఇంకొకరిని తిననివ్వదు.

 

ఇలాంటి వాళ్ల గురించి ఈ సామెత వాడతారు. ఇప్పుడు బీజేపీ, జనసేన కూటమి పని తీరు కూడా ఇలాగే ఉంది. ఏపీలో జగన్ పార్టీ వైసీపీ అధికారంలో ఉంది. కేంద్రంలో కమలం పార్టీ అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీల నేతలు కలసి పని చేస్తే.. ఏపీకి ఎంతైనా మేలు జరుగుతుంది. బీజేపీతో కలిసి పని చేసేందుకు జగన్ సిద్ధంగానే ఉన్నారు. అందుకే ఢిల్లీ వెళ్లి పెద్దలను కలుస్తున్నారు. ఏదైనా కీలక నిర్ణయాలు ఉంటే.. వాళ్లకు చెప్పే తీసుకుంటున్నారు.

 

కానీ ఏపీలో బలపడాలనే కోరిక ఉన్న బీజేపీ ఇప్పుడు జనసేనతో కలిసి నడవాలని నిర్ణయించింది. వాస్తవానికి ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదు. ఇటు జనసేన సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి సున్నా.. జనసేనకు ఒక్క సీట్ వచ్చాయి. ఇప్పుడు ఈ రెండు కలిసి వచ్చే ఎన్నికల్లో సీఎం సీటు సాధిస్తాయట. అందుకు ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నాయి. అందుకే బీజేపీ జ‌న‌సేన ఫిబ్రవ‌రి 2లాంగ్ మార్చ్ నిర్వహిస్తాయట.

 

ఇప్పుడు ఈ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ఏపీకి ఈ రెండు పార్టీలు చేసిందేమి లేదుగాని లాంగ్ మార్చ్ చేస్తాయా అని అంటున్నారు ఆంధ్రప్రజ. అస‌లు బీజేపీ ఏపీకి ఆరేడేళ్లలో చేసిందేమీ లేదు. అందుకే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీని తిడితే సెంటిమెంట్ వస్తుందనుకున్నారు కూడా. మరి ఇప్పుడు బీజేపీ, జనసేన కలిసి అధికారం కోసం అర్రులు చాస్తున్నాయని చెప్పొచ్చు. ప్రజాసమస్యలకు దూరంగా.. ఇలాగే పని చేస్తే.. ఐదేళ్లు కాదు ప‌దేళ్లు అయిన ఏపీలో నీళ్లు లేని గ్లాసులో వాడిన క‌మ‌లం త‌ప్పా ఏమీ ఉండకపోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: