ప్రస్తుతం ఏపిలో రాజకీయ రగడ కొనసాగుతుంది.  ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రస్తావన తెరపైకి తీసుకు వచ్చారో.. అప్పటి నుంచి ప్రతిపక్ష నేతలు అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారు.  పరిపాలనా సౌలభ్యం కోసం తాను తీసుకున్న నిర్ణయం సరైనదే అన్న వాదనతో సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు.  కానీ అమరావతి రాజధాని అని తమకు ఉన్న భూములు ఇచ్చామని.. ఇప్పుడు రాజధాని మారిస్తే తాము ఎటు పోవాలని రైతులు వాదిస్తున్నారు. ఇక రైతు వాదనే తమ వాదన అంటూ ప్రతిపక్ష నేతలు అరచి గగ్గొల్లు పెడుతున్నారు.  మొన్నటి నుంచి సాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఇదే రగడ కొనసాగుతుంది.  మొన్నటి వరకు టీడీపీ నేతలు ఇంగ్లీష్ వొద్దు.. తెలుగు ముద్దు అన్న వాదన వినిపించారు.. ఇప్పుడు మూడు రాజధానులు వద్దు.. అమరావతినే ముద్దు అనే వాదన  ముందుకు తీసుకు వస్తున్నారు. 

 

తాజాగా ప్ర‌భుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంపై చర్చ సందర్భంగా శింగనమల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏదైనా అనుకుంటే దానిని చేసి తీరుతారని పేర్కొంటూ.. ఓ సినిమా డైలాగును ఆమె ఉటంకించారు. 'నువ్వు అనుకుంటే అవ్వుద్ది స్వామి..నీ నవ్వు వరం.. నీ కోపం శాపం. నీ మాట శాసనం' అంటూ ఆమె పేర్కొన్నారు. ఇది ఖ‌లేజా మూవీ డైలాగ్. 

 

పేద, మధ్యతరగతి కుటుంబాల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెలుగులు నింపుతున్నారని అన్నారు. ఇంగ్లిష్‌ మీడియంలో చదివినంతమాత్రాన తెలుగు రాదనడం సరికాదన్నారు. చంద్రబాబుకు అమరావతి తప్ప మరేమీ కనిపించడం లేదని, ఆయన డ్రామాలు నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌ అని ఎద్దేవా చేశారు.  ఇది స‌రిలేరు సినిమాలోది చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ అసలు ఏ మీడియంలో చదువుకున్నారో అర్థం కావడం లేదని, ఆయనకు తెలుగు, ఇంగ్లిష్‌.. రెండూ రావడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: