తెలుగు పత్రికలు కొన్ని పార్టీలకు కర పత్రికలుగా మారుతున్నాయన్న విమర్శ చాలా కాలంగా ఉన్నదే. ఈనాడు, ఆంధ్రజ్యోతి తెలుగుదేశానికి అనుకూలమన్న వాదన ఉంది. ఇక సాక్షి సంగతి చెప్పేదేముంది. అది అధికారికంగానే వైసీపీ పత్రిక. అందులో ఎవరికీ అనుమానాలే లేవు. అయితే.. ఆయా పత్రికల పాలసీ చివరకు వాటి పాఠకుల సంఖ్యపై గణనీయంగా ప్రభావం చూపుతోంది.

 

తాజాగా.. నీల్సన్ సంస్థ నిర్వహించిన ఐఆర్ఎస్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. అదేంటంటే.. తెలుగుదేశం పత్రికలుగా పేర్కొనే ఈనాడు, ఆంధ్రజ్యోతి పాఠకుల సంఖ్య ఆంధ్రాలోనే గణనీయంగా తగ్గిపోతోంది. ఆంధ్ర, తెలంగాణ ఈ రెండు చోట్ల ఈ రెండు పత్రికల పాఠకుల సంఖ్య తగ్గుతోంది. అయితే ఈ తగ్గుదల ఆంధ్రాలో మరీ ఎక్కువగా ఉందన్నది సర్వే ఫలితం. ఆల్ ఇండియా రీడర్ షిప్ గణాంకాల్లో ఈనాడు తగ్గుదల ఆంధ్రాలో ఏకంగా 30 శాతం ఉండటం విశేషం.

 

అదే పత్రికకు తెలంగాణలో తగ్గుదల కేవలం 12 శాతం మాత్రమే. దీనర్థం ఇప్పటికీ ఈనాడును కాస్తోకూస్తో నిలబెడుతున్నది హైదరాబాద్, తెలంగాణ పాఠకులే అన్నమాట. సేమ్ టు సేమ్ ఆంధ్రజ్యోతి పత్రిక పరిస్థితి కూడా అంతే. ఆంధ్రజ్యోతి తగ్గుదల ఆంధ్రాలో 22 శాతం అయితే తెలంగాణలో తగ్గుదల 16 శాతం మాత్రమే. అంటే ఆంధ్రజ్యోతికి కూడా కాస్త బలాన్ని ఇస్తున్నది హైదరాబాద్, తెలంగాణ పాఠకులే అన్నమాట.

 

ఇదే సమయంలో సాక్షి పాఠకుల సంఖ్య తగ్గకపోగా.. పెరగడం విశేషం. ఈ పత్రిక తెలంగాణలో 1.5 శాతం పాఠకుల సంఖ్యను పెంచుకుంది. అదే సమయంలో ఆంధ్రాలో ఏకంగా 11 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. మరి ఇంత తేడా ఎందుకు వస్తోంది. జగన్ కరపత్రికగా ఉన్నా సాక్షి పాఠకుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది. ఇందుకు కారణం ఆయా పత్రికలు మోస్తున్న నాయకులే కారణమా.. చంద్రబాబును విపరీతంగా మోస్తున్న ఫలితంగానే ఎల్లో మీడియా దెబ్బ తింటోందా..? అంతేగా.. అంతేగా.. ?

మరింత సమాచారం తెలుసుకోండి: