2019 అసెంబ్లీ ఎన్నికలు ముగిసి దాదాపు 9 నెలలు కావొస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎన్నికల సందడి ఏమి నెలకొనలేదు. అయితే అసెంబ్లీ ఎన్నికలకంటే ముందే జరగాల్సిన పంచాయితీ, స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు ఇంతవరకు జరగలేదు. గత చంద్రబాబు ప్రభుత్వం ఓటమి భయంతో వీటిని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చింది. ఇక 2019 అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం...కొత్తది కావడంతో సెటిల్ అవ్వడానికి కాస్త సమయం తీసుకుంది. అయితే త్వరలోనే ఈ ఎన్నికలు జరపాలని జగన్ ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ బాబు అండ్ కొ మూడు రాజధానులపై రాజకీయం చేయడం మొదలుపెట్టారు.

 

అసలు జగన్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ రాజకీయం చేస్తున్న చంద్రబాబు..ఇప్పుడు మూడు రాజధానులని వ్యతిరేకిస్తూ ప్రజలని రెచ్చగొడుతున్నారు. ఈ నేపథ్యంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. అయితే కొంచెం అటు ఇటు అయిన త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం చూస్తుంది. కాకపోతే ఇప్పుడు మూడు రాజధానులపై రాజకీయం నడుస్తున్న వేళ వైసీపీకి 13 జెడ్పీ స్థానాలని క్లీన్ స్వీప్ చేయడం సాధ్యమేనా? అంటే అసాధ్యం కాదనే చెప్పొచ్చు.

 

ఎందుకంటే 2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలని ఒక్కసారి చూసుకుంటే  వైసీపీ 151 సీట్లు సాధిస్తే, టీడీపీ 23 సీట్లు, జనసేన ఒక సీటు గెలుచుకుంది. ఇక 13 జిల్లాల వారీగా చూసుకుంటే కడప, కర్నూలు, విజయనగరం,నెల్లూరు జిల్లాలని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. చిత్తూరులో ఒక సీటు కోల్పోయింది. అలాగే గుంటూరు, కృష్ణా, అనంతపురం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండేసి చొప్పున ఓడిపోయింది. ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలో నాలుగు చొప్పున, తూర్పుగోదావరి లో ఐదు సీట్లు ఓడిపోయింది.

 

అయితే ఈ లెక్కల పరంగా ఎలా వేసుకున్న 13 జెడ్పీ స్థానాలని వైసీపీ గెలవడం చాలా సులువు. పైగా ఈ 8 నెలలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, మూడు రాజధానుల వల్ల మరింత అడ్వాంటేజ్ పెరిగింది. కాబట్టి ఎలా చూసుకున్న వైసీపీకి 13 జెడ్పీ స్థానాల్లో గెలిచే సత్తా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: