సాధారణంగా ఏ రాజకీయ నాయకుడికైనా ఓటమి అనేది చాలా మార్పు తెస్తుంది. ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, తప్పొప్పులని తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటూ ముందుకెళతారు. అలా కాకుండా ఓడిపోయిన నాకు అధికారం లేకపోతే ఉండలేను అంటూ అడ్డుగోలు రాజకీయాలు చేస్తూ ముందుకెళితే ప్రజలు మరింత చీదరించుకుంటారు. సరిగా ఇదే పరిస్తితి ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎదురవుతుంది. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి చెంది కేవలం 23 సీట్లు దక్కించుకున్న బాబు....అసలు ఎందుకు ఓడిపోయామనే ఆత్మవిమర్శ చేసుకోకుండా అధికారమే పరమావధిగా, కొత్తగా అధికార పీఠం ఎక్కిన జగన్ ప్రభుత్వంపై రాజకీయం చేస్తున్నారు.

 

అసలు జగన్ ఏ నిర్ణయం తీసుకున్న దాన్ని గుడ్డిగా వ్యతిరేకించాలి, దానిపై రాజకీయం చేసి లబ్ది పొందాలని బాబు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎంత ప్రయత్నం చేస్తే...అంతగా ప్రజలకు దూరమవుతున్నారు. ఇక తాజాగా మూడు రాజధానులపై కూడా రాజకీయం చేస్తూ....బాబు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు దూరం అవుతున్నారు. ముఖ్యంగా బాబు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టలేని పరిస్థితికి వచ్చేశారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడాన్ని వ్యతిరేకించడం వల్ల..ఆ ప్రాంత ప్రజల వ్యతిరేకితని మూటగట్టుకున్నారు.

 

దీని వల్ల ఆ ప్రాంతానికి వెళ్లాల్సిన పని ఉన్న...వెళ్ళే సాహసం మాత్రం చేయడం లేదు. ఎన్నికల్లో ఓడిపోయాక చంద్రబాబు జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ నేతలకు దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన బాబు...విజయనగరం వెళ్లాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితిల్లో ఆ ప్రాంతానికి వెళితే బాబు ప్రజాగ్రహానికి గురవడం ఖాయం. ఆయన జిల్లా పర్యటనకు వెళ్లాలంటే మొదట విశాఖ ఎయిర్ పోర్ట్ వెళ్ళాలి...ఇక అక్కడ నుంచే బాబుకు చుక్కలు కనిపిస్తాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో గానీ...అమరావతే కావాలని చెప్పినన్ని రోజులు బాబు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టే సాహసం చేయలేరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: