జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే కొనసాగాలని చెబుతూ అమరావతి రైతుల ఆందోళనకు కూడా మద్దతు తెల్లుపుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఏపీ లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కూడా కలిసొచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో అమరావతిలో పవన్ కళ్యాణ్ కు 62 ఎకరాల భూమి ఉందని అందువలనే అమరావతిలోనే రాజధాని కొనసాగాలని పవన్ కోరుకుంటున్నాడని ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. 
 
వైసీపీ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ 62 ఎకరాల భూమిని లింగాయపాలెం, రాజుల పాలెం పరిసర ప్రాంతాల్లో 64బి, 67బి, 83బి మరియు మందడం దగ్గర కొనుగోలు చేశారని పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి పేరిట కూడా భూములు కొనుగోలు చేశారని ఆరోపణలు చేస్తున్నారు. జనసేన లీగల్ సెల్ మాత్రం పవన్ కు అమరావతిలో 62 ఎకరాల భూమి ఉన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. 
 
జనసేన లీగల్ సెల్ బాధ్యతలను పర్యవేక్షించే లాయర్ శింగలూరి శాంత ప్రసాద్ వైసీపీ పార్టీ నాయకులు, వైసీపీ సానుభూతి న్యాయవాదులు ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో అమరావతిలో పవన్ కళ్యాణ్ కు 62 ఎకరాల భూములు ఉన్నట్టు విష ప్రచారం మొదలుపెట్టారని చెబుతున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కు అమరావతిలో 1.50 ఎకరాల స్థలం మాత్రమే ఉందని మిగిలిన 60.50 ఎకరాల భూమి ఎక్కడ ఉందో చెబితే ఆ భూమిని ప్రభుత్వానికి ఇస్తామని సవాల్ విసిరింది. 
 
జనసేన శతఘ్ని టీం పవన్ ఢిల్లీలోని బీజేపీ పార్టీ నేతలతో సుదీర్ఘ కాలం చర్చలు జరపడంతో వైసీపీ పార్టీ అసత్యాలను ప్రచారం చేస్తోందని చెబుతోంది. వైసీపీ పార్టీ నేతలు పవన్ కు 62 ఎకరాల భూములు ఉన్నట్టు చేస్తున్న ఆరోపణలలో ఎటువంటి నిజాలు లేవని మంగళగిరిలో 90 సెంట్ల భూములకు సంబంధించిన దస్తావేజులను సర్క్యులేట్ చేస్తూ అబద్ధాలను వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని శతఘ్ని టీం ఆరోపణలు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: