ప్రతి పనికి ప్రారంభం ముగింపు ఎలా ఉంటాయో సంపదను పొందాలి అని ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఎంచుకునే పని ఒక ఆరంభంతోనే మొదలు అవుతుంది. వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడ మొదటి అడుగుతోనే ప్రారంభం అవుతుంది. 

ఐశ్వర్యం పొందాలి అని వ్యక్తి చేసే ప్రయత్నాలు ఒక రాకెట్ ను అంతరిక్షంలోకి పంపడం లాంటిది అని చాలామంది మనీ ఎక్స్ పర్ట్శ్ అంటూ ఉంటారు. ఒక రాకెట్ అంతరిక్షంలోకి వెళ్ళాలి అంటే ఎన్నో దశలు దాటితే కాని అంతరిక్షంలోకి ప్రవేశించలేకపోయినట్లుగా ఒక వ్యక్తి సాగించే సంపద ఆర్జన ప్రయాణంలో ఎన్నో దశలు దాటవలసి ఉంటుంది. 

వాస్తవానికి ఒక వ్యక్తి ఏదైనా ఒక వ్యాపారం ఒక ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ఆ విషయాలకు సంబంధించి మొదటి 15శాతం పనిని పూర్తి చేయగలిగితే మిగతా 85 శాతం పనిని చాల సులువుగా చేయగలుగుతాడు. దీనితో ఒక వ్యక్తి విజయావకాశాలను నిశ్చయించేది మొదటిగా ఎదురయ్యే ఆ పదిహేను శాతంకు సంబంధించిన అవరోధాలు మాత్రమే. అందుకే గతంలో మన పెద్దలు ఒక లక్ష మనం గణించ గలిగితే ఆ లక్ష మరిన్ని లక్షల గణింపుకు దారి చూపెడుతుంది అంటూ ఉంటారు. 

ఇప్పుడు డబ్బు విలువ మారిపోయింది కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో ఒక వ్యక్తి తన స్వయం కృషితో ఒక కోటి రూపాయలు సంపాదించగలిగితే ఆ కోటి రూపాయలు మరిన్ని కోట్ల రూపాయలకు సంపాదనకు దారి చూపుతుంది. వాస్తవానికి చాలామందికి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది అందువల్ల మనకు ఎన్ని ఆలోచనలు ప్రణాలికలు ఉన్నా ఆచరణకు నోచుకోవు. వ్యాపారాలలో నూటికి ఎనబై మంది తమ మొదటి పదిహేను శాతం పనులు చేయడంలో వైఫల్యం చెంది పరాజితులుగా మారిపోతారు. ముఖ్యంగా వ్యాపారాలకు సంబంధించి ముందుగా ఎదురయ్యే బాలారిష్టాలను అడుగులు వేయగల వారికే అంతిమ విజయం లభిస్తుంది. అందుకే కేవలం ఆరంభమే కాదు ఆ ఆరంభాన్ని కొనసాగించే శక్తి వారికే విజయం లభించి సంపాద చేరుకూరుతుంది..

   

మరింత సమాచారం తెలుసుకోండి: