ఈ మధ్య కాలంలో కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు మరియు కార్యకర్తలు, టీడీపీ సానుభూతిపరులు పరిమితులు దాటి ప్రవర్తిస్తున్నారు. వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫోటోపై చిన్న పిల్లాడితో మూత్రం పోయించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ కొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు పైశాచికానందం పొందుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు సాధారణమే. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు ఇలా నీచ రాజకీయాలకు దిగుతూ ఉండటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 
 
మండలి ఛైర్మన్ ను ఉద్దేశించి బొత్స సత్యనారాయణ నువ్వు సాయిబుకే పుట్టావా...? అని అన్నాడని దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు చిన్న పిల్లాడితో మంత్రిగారి ఫోటో మీద మూత్రాభిషేకం చేయించారని తెలుస్తోంది. పైకి ఒక వర్గం వారు ఇలా చేశారని చెబుతున్నా తెలుగుదేశం పార్టీ నేతలే ఇలా చేయడానికి కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, నీచ రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు బహిరంగంగా రాజకీయ నాయకులపై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి మూత్రాభిషేకాలు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే రాజకీయ నాయకులంటేనే ప్రజల్లో దురభిప్రాయం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఇలాంటి పనులు చేయటం వలన చేసిన వారిపై, చేయించిన వారిపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. 
 
రాజకీయమంటే బాధ్యతతో కూడిన వ్యవహారం. ఏవైనా సమస్యలుంటే విమర్శలు చేయడంలో తప్పు లేదు కానీ ఇలాంటి దిక్కుమాలిన సంస్కృతికి నాంది పలకడం ఏ మాత్రం మంచిది కాదు. ఇలాంటి సిగ్గులేని రాజకీయాలు చేయడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. సాక్షాత్తూ మంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటివి చేయటం వలన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలే తమకు ఎమ్మెల్యేలు, మంత్రులంటే ఎలాంటి అభిప్రాయమో చెబుతూ ప్రజల్లో చులకన అవుతున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు ఇలాంటి ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలకు దూరంగా ఉండాలని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: