తెలుగుదేశం అంటే గుడివాడ....గుడివాడ అంటే తెలుగుదేశం...ఇది ఒకప్పటి మాట....గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా...ఇది ఇప్పటి మాట. టీడీపీ ఆవిర్భావం నుంచి కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా ఉంది. ఇక్కడ నుంచి ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 1983, 85 ఎన్నికల్లో విజయం సాధించి....ఏపీ సీఎంగా పని చేశారు. ఇక 89 ఎన్నికల్లో ఓడిపోయినా టీడీపీ..1994,1999 ఎన్నికల్లో వరుసగా గెలిచింది. తర్వాత కొడాలి నాని ఎంటర్ కావడంతో పరిస్థితులు తారుమారైపోయాయి.

 

2004లో టీడీపీ తరుపున గుడివాడ బరిలో దిగిన నాని...అప్పుడు రాష్ట్రమంతా వైఎస్సార్ గాలి వీచిన..ఎమ్మెల్యేగా విజయం సాధించి సత్తా చాటారు. మళ్ళీ 2009లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఇక ఇక్కడ నుంచే పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. చంద్రబాబు కుట్ర రాజకీయాలకు నాని...వైఎస్ జగన్ వైపు వచ్చేశారు. 2012లో వైసీపీలో చేరిన ఆయన...2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున బరిలో దిగి విజయం సాధించారు. ఈ విజయంతోనే టీడీపీ కంచుకోట కాస్త నాని అడ్డాగా మారిపోయిందని అర్ధమైపోయింది. ఈ క్రమంలోనే 2019లో కూడా బంపర్ విక్టరీ కొట్టిన నాని జగన్ ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు.

 

అయితే కొడాలి దెబ్బకు గుడివాడలో టీడీపీని కాపాడే నాథుడే లేకుండా పోయాడు. 2014లో ఓడిపోయిన రావి వెంకటేశ్వరరావు పార్టీలో కనబడటం లేదు. అటు 2019లో టీడీపీ రాజకీయానికి బలైన దేవినేని అవినాష్ వైసీపీలో చేరారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ పేరే వినబడటం లేదు. పైగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, కొడాలి చేస్తున్న అభివృద్ధికి గుడివాడలో టీడీపీ అడ్రెస్ గల్లంతు అయిపోయింది. ఆఖరికి మూడు రాజధానులని కూడా ఇక్కడ ప్రజలు స్వాగతిస్తున్నారనే చెప్పొచ్చు.

 

ఎందుకంటే నియోజకవర్గంలో కొందరు టీడీపీ ఛోటా మోటా నాయకులు టెంట్లు వేసుకుని జై అమరావతి అని అరుస్తున్న ప్రజలు వారిని పట్టించుకోవడం లేదు. ఏది పని లేక హడావిడి చేస్తున్నారని జనం ఆ టెంట్లు చూసి నవ్వి వెళ్లిపోతున్నారు. మొత్తానికైతే కొడాలి దెబ్బకు గుడివాడలో టీడీపీ సోదిలో లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: