జగన్‌ని నమ్ముకుంటే ఏదొక రోజు న్యాయం చేస్తారు. ఈ మాట వైసీపీలో ఉండే ప్రతి నేతకు తెలుసు. అందుకే 2014లో అధికారం కోల్పోయిన కొందరు నేతలు జగన్‌నే నమ్ముకుని ఉన్నారు. చంద్రబాబు కుట్రలకు కొందరు మారిపోయిన...చాలామంది జగన్‌ వెనుకే ఉన్నారు. ఇక అలాంటి వారికి 2019లో అధికారంలోకి వచ్చాక ఎలాంటి న్యాయం చేశారో అందరికీ తెలుసు. అదే సమయంలో తమ పార్టీ నేతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీడీపీ నుంచి వచ్చిన చాలమందికి కూడా జగన్ తగిన ప్రాధాన్యత ఇచ్చారు.

 

ఈ క్రమంలోనే టీడీపీ నుంచి వచ్చిన కొందరు మాజీ నేతలు ఏదైనా పదవి ఇవ్వకపోరా అని ఎదురుచూస్తున్నారు. అలా ఎదురు చూసే నేతల్లో తూర్పు గోదావరిలోని మాజీ టీడీపీ ఎంపీలు తోట నరసింహం, పండుల రవీంద్రబాబులు ముందున్నారు. 2014 ఎన్నికల్లో తోట నరసింహం కాకినాడ ఎంపీగా పోటీ చేసి విజయం సాధిచారు. అటు పండుల అమలాపురం నుంచి గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో బాబు ఈ ఇద్దరినీ మోసం చేయడంతో వారు...జగన్ చెంతకు చేరారు.

 

ఇక 2019 ఎన్నికల్లో నరసింహం ఆరోగ్యం అంత బాగోకపోవడంతో ఆయన భార్య శ్రీవాణికు...జగన్ పెద్దాపురం అసెంబ్లీ టికెట్ ఇచ్చి న్యాయం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఆమె చినరాజప్ప చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఓడిన దగ్గర నుంచి తోట ఫ్యామిలీ రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ ‌గా ఉన్నట్లు అనిపించడం లేదు. అలా అని జగన్ ఆ ఫ్యామిలీకి నామినేటెడ్ పదవి లాంటిది కూడా ఏం ఇవ్వలేదు. అయితే పాలనలోకి వచ్చి 8 నెలలే అయింది కాబట్టి భవిష్యత్తులో ఏదైనా అవకాశం కల్పించవచ్చు.

 

అటు పండుల రవీంద్రకు 2019 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అప్పటికే అభ్యర్ధులు ఖరారు అయిపోవడం, పండుల వేరే సీటు అడగడంతో ఎన్నికల్లో నిలబడటం కుదరలేదు. ఎన్నికల అయిన దగ్గర నుంచి పండుల కూడా పెద్దగా కనబడటం లేదు. అయితే పండులకు ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం మండలి రద్దు ఆలోచన చేస్తున్నారు కాబట్టి...ఆ ఎమ్మెల్సీ అవకాశం ఉండకపోవచ్చు. దాని బదులు వేరే పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మండలి ఉంటే ఎమ్మెల్సీ దక్కొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: