ఏపీ రాజధాని రైతుల ర‌గ‌డ కొన‌సాగుతూనే ఉంది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి రాజధాని అమరావతిలోని రైతులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మ‌రోవైపు మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే పాలన వికేంద్రీకరణ దిశగా ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో అమరావతి మ‌రింత‌ ఉద్రిక్తంగా మారింది. పోలీసుల నిర్బంధాన్ని తెంచుకొని జనం రోడ్లపైకి దూసుకొస్తున్నారు. ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని, మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ ఆందోళనకారులు నిరసనలతో హోరెత్తించారు.  అలాగే ఈ అసమర్థ పాలన మాకొద్దు.. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాం అని డిమాండ్ చేస్తున్నారు.

 

మ‌రోవైపు ప‌తిప‌క్షాలు కూడా వాళ్ల‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ నిర‌స‌న‌ల‌కు దిగుతున్నాడు. ఈ క్ర‌మంలోనే అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అమరావతిలోనే క్యాపిటల్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా సీఎం జగన్ స్పందించడం లేదని రైతులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మరోక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.  రాజధాని పరిధిలోని గ్రామాలను శాంతింపజేసేందుకు అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 

 

రాజధాని ప్రాంతంలో కొత్తగా మూడు గ్రామాలు కలిపి కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు మొదలు పెట్టారు.  అయితే రాజధాని అమరావతిలోని మూడు గ్రామాలు పెదపరిమి, వడ్డెమాను, హరిశ్చంద్రపురం కలిపి కార్పొరేషన్ గా ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు మొదలెట్టారని సమాచారం. ఈ నేప‌థ్యంలోనే లో శుక్రవారం పెదపరిమిలో అధికారులు గ్రామ సభ నిర్వహించి ప్రజల అభిప్రాయం తీసుకోవాలని అనుకున్నారు. అయితే గ్రామాల్లో ప్రజలు తక్కువగా హాజరుకావడంతో సోమవారానికి వాయిదా వేసిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా రాజ‌ధాని ర‌గ‌డ తీవ్ర స్థాయిలో జ‌రుగుతున్న వేళ సీఎం జ‌గ‌న్ మోమ‌న్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఏ మేరకు వర్కోట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: