వైయస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో కి కొత్త మంత్రి వస్తున్నారు. అదేంటి ఇప్పటికే ఎంతో మంది మంత్రులు ఉండగా ఇప్పుడు మళ్లీ కొత్త మంత్రా... అంటారా... మంత్రి పాత వాడే... కానీ  బాధ్యతలు కొత్తవి. జగన్ క్యాబినెట్ లోని ఓ మంత్రి కి  అదనపు బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ మంత్రి  ఎవరో కాదు మేకపాటి గౌతమ్ రెడ్డి. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని  మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అయితే మేకపాటి గౌతమ్ రెడ్డి కి అదనపు బాధ్యతలు అప్పగించాలి అని నిర్ణయించిన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి.. నిన్న జరిగిన భేటీ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కి అదనపు బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. 

 

 స్కిల్ డెవలప్మెంట్, ట్రైనింగ్ శాఖల మంత్రిత్వశాఖను మేకపాటి గౌతమ్ రెడ్డి  అదనపు బాధ్యతలుగా  చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తన మీద ఉన్న నమ్మకంతో తనకు అదనపు బాధ్యతలు అప్పగించడం పై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపిన మంత్రి గౌతమ్ రెడ్డి.. నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ద్వారా... ప్రభుత్వంపై యువతకు ఉన్న విశ్వాసాన్ని మరింత పెంచేలా  శాయశక్తులా కృషి చేస్తాను అంటూ మంత్రి వెల్లడించారు. 

 

 

 ఉపాధి నైపుణ్య శిక్షణ లో రాష్ట్రంలోనే యువత అందరికీ ఉపయోగపడేలా వినూత్న ఆలోచనలతో కార్యక్రమాలు నిర్వహించి... రాష్ట్రంలోనే యువత అందరికీ సరికొత్త ఆలోచనలు ప్రతిబింబించేలా ముందుకు వెళ్లడానికి కృషి చేస్తాను అంటూ ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హామీ ఇచ్చారు. అత్యున్నతమైన ప్రపంచ స్థాయి కోర్సులను సైతం రాష్ట్ర యువత అందరికీ అందించి... ప్రపంచ స్థాయి నైపుణ్యతను యువతలో  పెంపొందించి... వరల్డ్ క్లాస్ వర్క్ ఫోర్సు ని తయారు చేయడానికి కృషి కృషి చేస్తారని స్పష్టం చేశారు. యువతకు జగన్ ప్రభుత్వం పై మరింత నమ్మకాన్ని పెంచేలా తాను ఆయా శాఖల్లో పని చేస్తాను  అంటూ హామీ ఇచ్చారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: