తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏపీ ప్రజలకు పెద్దగా కిక్ ఇవ్వలేదనే చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత మొదట్లో ఏపీ ప్రజలు తెలంగాణ రాజకీయాల పట్ల కొంత ఆసక్తి చూపించేవారు. కానీ తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఏ ఎన్నికల్లో పోటీ చేసినా వార్ వన్ సైడ్ అనే విధంగా ఫలితాలు వస్తున్నాయి. 
 
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి పోటీని ఇచ్చే స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లేకపోవడం వలన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా లేకుండా పోయాయి. ఏపీ ప్రజల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా పోయింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే సర్వేల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. 
 
ఈరోజు కౌంటింగ్ మొదలైనప్పటి నుండి కూడా టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగానే కొన్ని ప్రాంతాలు మినహా ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ విజయం సాధించింది. వందకు పైగా మున్సిపాలిటీలలో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపొందింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయపరంపర కొనసాగుతోంది. 
 
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బలపడాలని ప్రయత్నాలు చేస్తున్నా నాయకత్వ లేమి, ఇతర కారణాల వలన రాష్ట్రంలో బలపడలేకపోతున్నాయి. దీనివలన ఫలితాలను ఆసక్తిగా గమనిస్తున్న ఏపీ ప్రజలకు కూడా ఫలితాలు అంత కిక్ ఇవ్వలేకపోయాయి. 2019 ఎన్నికల్లో ఏపీలో ఏ విధంగా వార్ వన్ సైడ్ అనేలా ఫలితాలు వచ్చాయో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా ఫలితాలు వచ్చాయని ఏపీ ప్రజలు వచ్చాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.                                       

మరింత సమాచారం తెలుసుకోండి: