అదేంటి 2019 ఎన్నికలయ్యే 8 నెలలు కాలేదు...అప్పుడే 2024 ఎన్నికల గురించి ఏంటి? పైగా అప్పుడు కూడా వైసీపీదే అధికారమని ఎలా చెప్పగలం అని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు అదే విషయానికి వద్దాం. ఒకప్పటిలా రాజకీయాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు ప్రతి విషయంలోనూ ఏ పార్టీకి ఎంత లాభం వస్తుంది....ఏ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందనే లెక్కలు వేసుకోవడం కామన్ అయిపోయింది. అధికారంలో ఉన్న పార్టీ తీసుకునే నిర్ణయాలు, పథకాలని బట్టి పార్టీకి ఎంత మైలేజ్ వస్తుంది. ఇక అదే నిర్ణయాలపైన రాజకీయం చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఎంత మైలేజ్ వస్తుందని అంచనాలు వేసుకుంటున్నారు.

 

ఇలాగే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ విధమైన లెక్కలే వస్తున్నాయి. అటు వైసీపీ పాలనలో విఫలమైందని 2024లో తమదే అధికారమని టీడీపీ అధినేత చంద్రబాబుతో సహ, ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఇటు జగన్ పాలన సూపర్ ఉందని చెబుతూ…. ఆ పార్టీ శ్రేణులు భవిష్యత్ ఎన్నికల గురించి అంచనాలు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులతో పాటు చాలామంది న్యూట్రల్ వ్యక్తులు 2024 ఎన్నికల గురించి కొన్ని లెక్కలు గురించి చర్చ చేసుకుంటున్నట్లు తెలిసింది.

 

వారి అంచనాలు, లాజిక్‌లు చూస్తుంటే ఎక్కువ రియాలిటీగానే కనిపిస్తున్నాయి. అయితే అసలు వారి అంచనా ప్రకారం 2024లో కూడా వైసీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ప్రస్తుతం జగన్ అందిస్తున్న పాలన బాగుందని, పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయని, ముఖ్యంగా మూడు రాజధానుల నిర్ణయం వల్ల పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని, అది ఏ ఆటంకం లేకుండా అమలైతే 2024లో మంచి ఫలితం రాబట్టడం ఖాయమని అంటున్నారు.

 

ఈ మూడు రాజధానుల వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశముందని అంటున్నారు. అటు ఇటుగా 90 శాతం సీట్లు దక్కించుకోవచ్చు అంటున్నారు. ఇక ఇటు ఉత్తరాంధ్ర పక్కన ఉన్న తూర్పుగోదావరి, అటు రాయలసీమకు దగ్గర ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా వైసీపీ మెజారిటీ సీట్లు చేజిక్కించుకునే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సగంపై సీట్లు దక్కించుకున్న బంపర్ మెజారిటీతో రెండోసారి జగన్ అధికారంలోకి రావడం పక్కా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: