దిశ సామూహిక అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చికిత్స నిమిత్తం బయటకు వెళ్లిన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు లారీ డ్రైవర్లు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత దొరికిపోతామేమోనని.. హత్య చేసి పెట్రోల్ పోసి కాల్చిపడేశారు ఆ నీచులు. ఆ నీచులను కేవలం 24 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత కొన్నిరోజుల్లో వారిని పోలీసులు ఎన్ కౌంటర్ చేసేశారు.

 

ఆ నిందితులను కోర్టులో హాజరుపరచగా ఆ నిందితులను 14రోజులు రిమాండ్ లో ఉంచాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే విచారణలో భాగంగా ఆ నీచులను సిన్ రికర్రెక్షన్ కోసం ఘటన స్థలంలోకి తీసుకురాగా ఆ సమయంలో ఆ నిందితులు పారిపోవాలని చూసి పోలీసులపై దాడి చెయ్యడం వల్ల పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నిందితులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ నిందితులు నలుగురు ఈ నెల 6వ తేదీన తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు మృతిచెందారు. ఈ రేప్, ఎన్ కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

 

అయితే అప్పట్లో సీఎం కేసీఆర్ పై దిశ కేసు విషయంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కనీసం దిశ తల్లిదండ్రులను పలకరించలేదని.. చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్ కౌంటర్ తర్వాత మాత్రం అంతా కేసీఆర్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఎక్కడా దిశ ఘటనపై మీడియా ముందు స్పందిచలేదు. తాజాగా మున్సిపల్ ఎన్నికల వేళ మీడియా సమావేశం నిర్వహించిన కేసీఆర్ పరోక్షంగా దిశ ఘటనపై స్పందించారు.

 

ఇలాంటి ఘటనలను తగ్గించేందుకు మనం ఎవరిని నిందించినా ఫలితం ఉండదు. మన పిల్లలకు నైతిక విలువలు నేర్పాలన్నారు. మన పిల్లలకు నైతిక విలువలను విద్యావ్యవస్థలోనే నేర్పాలి. ఇందుకోసం ప్రయత్నం జరుగుతోంది.. ఈ మోరల్ ఎడ్యుకేషన్ పాఠాలు రూపొందించేందుకు న్యాయనిపుణులు, మాజీ డీజీపీలు, పీఠాధిపతులతో చర్చిస్తున్నాం.. అదే ఈ సమస్యకు పరిష్కారం అంటూ చెప్పారు కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: