టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఆర్థిక శాఖ మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు తాజాగా సీఎం జ‌గ‌న్‌కు భారీ ఎత్తు న కౌంట‌ర్లు ఇచ్చారు. అదేస‌మ‌యంలో ఏపీ శాస‌న మండ‌లికి సంబంధించి కొన్ని తీర్పులు కూడా ఇచ్చా రు. జ‌గ‌న్ నిర్ణ‌యం సాకారం కాద‌న్నారు. మండ‌లి ర‌ద్దు ఈయ‌న చేతుల్లో లేద‌ని, ఒక వేళ ప్ర‌భుత్వం అసెం బ్లీలో తీర్మానం చేసినా..దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామ‌ని చెప్పారు. సో.. మొత్తానికి మండ‌లి ర‌ద్దు అనే ప్ర‌క్రియలో జ‌గ‌న్ ఓట‌మి ఖాయ‌మ‌ని తీర్పు చెప్పేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, గ‌తంలో ఎన్టీఆర్ ప్ర‌భుత్వం మండ‌లిని ర‌ద్దు చేసిన‌ప్పుడు ఇవ‌న్నీ కూడా జ‌రిగాయి.

 

మ‌రి అప్ప‌టి ప‌రిస్థితుల‌ను య‌న‌మ‌ల ఎందుకు గుర్తుకు తెచ్చుకోవ‌డం లేదు. గ‌తంలో ఎన్టీఆర్ ప్ర‌భుత్వం మండ‌లిని ర‌ద్దు చేయాల‌ని భావించింది. ఈ క్ర‌మంలో మండ‌లిలో కాంగ్రెస్‌కు అధిక బ‌లం ఉండ‌డంతో అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరా గాంధీ మండ‌లి ర‌ద్దుకు ఒప్పుకోలేదు. ఇక‌, ఇదేస‌మ‌యంలో ఎన్టీఆర్ నిర్ణ‌యంపై సుప్రీంలో కేసు కూడా దాఖ‌లైంది. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ ఓడిపోయారు. అయినా కూడా ఎన్టీఆర్ ప‌ట్టుబ‌ట్టి .. మ‌ళ్లీ బిల్లును ఇక్క‌డ ఆమోదించుకుని, మ‌రోసారి రాజీవ్‌గాంధీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న నేప‌థ్యంలో మ‌ళ్లీ పంపారు.

 

అప్పుడు ఎన్టీఆర్ తీసుకున్న మండ‌లి ర‌ద్దుకు కేంద్రం ప‌చ్చ‌జెండా ఊపింది. ఇప్పుడు, ఏపీలో ఇలాంటి ప‌రిస్థితి లేదు క‌దా!  ఎన్టీఆర్ హ‌యాంలో ఓ ప‌త్రికాధిప‌తికి ప్ర‌యోజ‌నం చేసేందుకు తీసుకున్న నిర్ణ‌యం.. కానీ, నేడు ప్ర‌జా ప్ర‌యోజ‌నం  వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధికి గాను పాల‌న వికేంద్రీక‌ర‌ణ‌కు జ‌గ‌న్ ప్ర బుత్వం దూకుడు గా ఉంది. ఈ క్ర‌మంలో ఆయా బిల్లుల‌ను వ్య‌తిరేకించి ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్ట‌డం వ‌ల్ల టీడీపీ తాత్కాలిక ఆనందం పొందితే పొంది ఉండొచ్చు. కానీ, అంతిమంగా ఇక్క‌డ కూడా ప్ర‌భుత్వా ని దే పైచేయి అవుతుంద‌నే విష‌యాన్ని మాత్రం విస్మ‌రించ‌డం స‌మంజ‌సంగా అనిపించ‌డం లేద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: