శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లు, సీఆర్ డీఏ బిల్లులను అనూహ్యంగా సెలెక్టు కమిటీకి పంపడం ద్వారా జగన్ కు ముకుతాడు వేసామని చంద్రబాబు పొంగిపోయారు. ఆయన పార్టీ కార్యకర్తలు ఆయనపై పూల జల్లు జల్లారు. చంద్రబాబు కూడా జగన్ ను భలే దెబ్బ కొట్టేశాం కదా.. అంటూ సంబరాలు జరుపుకున్నారు. పార్టీనేతలతో కలసి ఆనందం పంచుకున్నారు. అయితే ఆ ఆనందం మూడు నాళ్ల ముచ్చటే అవుతోంది.

 

శాసన మండలిలో ఉన్న మెజారిటీ ద్వారా జగన్ ను దెబ్బకొట్టాలనుకుంటే.. ఇప్పుడు ఆ మండలి ఉనికికే ప్రమాదం వచ్చేసింది. జగన్ దాన్ని రద్దు చేయాలని భావిస్తుంటే.. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబుపై మండిపడుతున్నారట. మీరు చేసిన ప్లాన్ వల్లే ఇప్పుడు అసలుకే ఎసరొచ్చేసింది. పదవులు పోయే పరిస్థితి వచ్చిందంటూ మండిపడుతున్నారట. అందుకే మొత్తానికే పదవి కోల్పోవడం కంటే.. వైసీపీలో చేరి దాన్ని కాపాడుకోవడం బెటర్ అని కొందరు ఆలోచిస్తున్నారట.

 

మండలి పరాభవంపై అసలే కోపంగా ఉన్న జగన్.. టీడీపీ ఎమ్మెల్సీలు వస్తే లాగేద్దాం.. లేకుంటే మూసేద్దాం.. అనే కోణంలో ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ జగన్ కొత్త ప్లాన్ టీడీపీని వణికిస్తోంది. ఎమ్మెల్సీలను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీ గుండెళ్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాయి. జగన్ ప్రయత్నాలు ఫలించి మండలిలో మెజారిటీ వస్తే రద్దు ఆలోచనను విరమించుకునే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు కొందరు ఎమ్మెల్సీలు వైసీపీ వైపు చూస్తున్నారట.

 

 

శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి మండలి రద్దుకు నిర్ణయం తీసుకోవాలా.. లేక మెజారిటీ వస్తే కొనసాగించటమా అన్న అంశంపై జగన్ లోతుగా మంతనాలు జరుపుతున్నారు. ఆయన వ్యూహం ఏంటన్నది ప్రస్తుతానికి అంతుబట్టకుండా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును గట్టెక్కించుకోకపోతే మండలిని రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రతిపక్ష ఎమ్మెల్సీలు వణికిపోతున్నారట. తమకు ఈ పరిస్థితి కల్పించిన చంద్రబాబుపై బాహాటంగానే విమర్శలు చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: