మంత్రివర్గంలోని ఆ ఇద్దరు మంత్రులకు మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా హామీ ఇచ్చారట. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ. వీళ్ళిద్దరూ మొన్నటి ఎన్నికల్లో రామచంద్రాపురం, రేపల్లె నియోజకవర్గాల్లో పోటి చేసి ఓడిపోయారు. అయితే వీళ్ళేమో జగన్ కు అత్యంత సన్నిహితులు. అందుకనే ఎంఎల్ఏలుగా ఓడిపోయినా వీళ్ళిద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తర్వాత  శాసనమండలి సభ్యులను చేశారు.

 

సీన్ కట్ చేస్తే తాజా రాజకీయ పరిణామాల్లో శాసనమండలి ఉనికే ప్రశ్నార్ధకమైపోయింది. సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మండలి అవసరం లేదని తేలిపోతే వెంటనే మండలి రద్దు ప్రక్రియకు శ్రీకారం చుట్టటం ఖాయం. మండలిలో మెజారిటి ఉందని టిడిపి ఓవర్ యాక్షన్  చేసిన ఫలితంగా ఇపుడు మొదటికే మోసం రాబోతోంది.  మండలి రద్దు అయితే  టిడిపి సభ్యులతో పాటు వైసిపి, బిజెపి, పిడిఎఫ్, స్వంతంత్రులు కూడా సభ్యత్వాలను  కోల్పోతారు.

 

సరే ఎవరి విషయం ఎలాగున్నా ముందుగా సమస్య వచ్చేది మాత్రం మంత్రులిద్దరికే. మండలి రద్దయినా ఆరు మాసాల వరకూ వీళ్ళద్దరు మంత్రులుగా కంటిన్యు అయ్యే అవకాశం ఉంది. కానీ తర్వాతైనా ఎక్కడో ఓ చోట నుండి మళ్ళీ ఎంఎల్ఏలుగా పోటి చేసి గెలవాల్సిందే. మరి వీళ్ళు పోటి చేయటం కోసం త్యాగాలు చేసే  సిట్టింగ్  ఎంఎల్ఏలు ఎవరు ?

 

ఈ విషయంలో పార్టీలో గందరగోళమే నెలకొంది.  ఎవరో ఎంఎల్ఏలను రాజీనామాలు చేయించటం మళ్ళీ ఉపఎన్నికలు పెట్టించటం అవసరమా అనే చర్చ కూడా మొదలైంది. వీళ్ళద్దరు మంత్రిపదవులను కోల్పోయినా క్యాబినెట్ ర్యాంకుండే ఏవో పదవులు ఇవ్వటమైతే ఖాయమనే ప్రచారం మొదలైంది. ఈ విషయంలోనే జగన్ వీళ్ళిద్దరికీ గట్టి హామీనే ఇచ్చారట. అందుకనే వీళ్ళు కూడా మండలి రద్దకు స్వచ్చంధంగా అసెంబ్లీలో ఆమోదం తెలిపారు. కాబట్టి మండలి రద్దుకు తీర్మానం జరగటం, ప్రక్రియ మొదలవ్వటం ఇక లాంఛనమే.

 

 

 

 

  

 

మరింత సమాచారం తెలుసుకోండి: