కొన్ని కొన్ని సార్లు మనం ఊహించినవి.. మనం ఎక్సపెక్ట్ చేసినవి జరగవు.. మనం వారి నుంచి మనకు ఎంతో సప్పోర్ట్ ఆశించి ఉంటాం.. ఎందుకంటే మొదట నుండి మనకు వారు ఎంతో దగ్గర వారు.. మనకోసం ఎన్నో వదులుకున్న వారు అని. మనం నెత్తిన పెట్టుకుంటాం.. కానీ ఎందుకో వారు ఉన్న లేనట్టే ప్రవర్తిస్తారు.. 

 

ఎవరి గురించి చెప్తున్నారు? అని మీకు సందేహం వచ్చి ఉంటుంది కదా ? ఇంకెవరి గురించి చెప్తా అండి.. మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ గురించి చెప్తున్నా.. అయన సీఎం జగన్ కోసం మొదటి నుండి త్యాగాలు చేసి.. ఓటమిలోను కలిసి నడిచారు. కుటుంబం అంత కూడా సీఎం జగన్ తో కలిసి నడిచింది. 

 

అందుకే.. సీఎం జగన్ అధికారంలోకి రాగానే ఆయనకు తగిన మంత్రి పదవి ఇచ్చారు. మిగితా వారందరిని కాదు అని ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. అయితే అలాంటి వ్యక్తి అన్నేళ్లు కష్టపడినా వ్యక్తి సీఎం జగన్ కు మద్దతు ఇస్తూ ఎంత గట్టిగా మాట్లాడాలి? ఎంత సపోర్టు ఉండాలి? కానీ సీఎం జగన్ కోసం ఎక్కడ మాట్లాడాడు... 

 

అటు అసెంబ్లీలోనూ, ఇటు బ‌య‌టా ప్ర‌భుత్వం త‌ర‌పున వాయిస్ ఏ మాత్రం వినిపించ‌డం లేదు.. ఎప్పుడో గుర్తున్న‌ప్పుడు మిన‌హా... మాట్లాడిన పిర‌స్థితి లేదు. అటు జిల్లాలోనూ ప్ర‌భుత్వానికి ఉపయోగం లేదు.. పార్టీకి ప్ల‌స్ కాలేదు.. త‌మ్ముడు ధ‌ర్మాన ఇటు అసెంబ్లీలో ఇర‌గీస్తూ జ‌గ‌న్‌కు అండ‌గా ఉంటున్నాడు... కృష్ణ దాస్ మాత్రం మౌనం...

 

కృష్ణ దాస్ మౌనం ఎందుకు? ఎప్పుడు చూడు మిగితా మంత్రులే మాట్లాడుతారు.. మాట్లాడితే బుగ్గన లేదా బొత్స.. లేదా కన్నబాబు వీళ్ళు తప్ప మీరు మాట్లాడారా.. అందరూ ఎక్కడో ఒకచోట కదులుతున్నారు.. కానీ కృష్ణ దాస్ మాత్రం ఏ మాత్రం మౌనం వీడటం లేదు.. ఈయన మౌనం వెనుక ఆంతర్యం ఏంటి? ఇతను జగన్ క్యాబినెట్ లో ఉండి కూడా ఉండనట్టేనా?

మరింత సమాచారం తెలుసుకోండి: