ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శాసన మండలి రద్దుకు  నిర్ణయించిన విషయం తెలిసిందే.దీనికి  సంబంధించి ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం తెలిపి పార్లమెంటులో కూడా తీర్మానం ప్రవేశపెట్టింది జగన్ సర్కార్ . ఈ నేపథ్యంలో పార్లమెంటరీ రద్దు పై  విపక్ష పార్టీలు నేతలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంటు రద్దు చేసిన జగన్ మోహన్ రెడ్డిపై  విమర్శలు గుప్పిస్తున్నారు విపక్ష  పార్టీల నేతలు. టీడీపీతో పాటు బిజెపి జనసేన పార్టీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే శాసన మండలి రద్దు చేయడం పై స్పందించిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తీవ్ర విమర్శలు చేశారు. 

 

 

 ఆంధ్రప్రదేశ్ శాసన మండలి తీర్మానం ప్రవేశ పెట్టడాన్ని వ్యతిరేకించినా టిడిపి ఎమ్మెల్సీ మాధవ్... ఆనాడు జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి శాసన మండలిని ఏర్పాటు చేస్తే ఈనాడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ మాధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు శాసనమండలిని పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంటే... ఇక ఇప్పుడు రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి  శాసనమండలిని రద్దు చేయటం  దురదృష్టకరం అంటూ విమర్శించారు. 

 

 

 శాసన మండలి రద్దు విషయంలో వైసీపీ టీడీపీ పార్టీలు దోషులేనని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. అయితే శాసన మండలి రద్దు విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదు అంటూ ఆయన స్పష్టం చేశారు. శాసన మండలి రద్దుకు  కొంచెం సమయం పట్టవచ్చని... శాసనమండలి రద్దు అయ్యేంత వరకు న్యాయ పోరాటం చేసే హక్కు ఎమ్మెల్సీలకు ఉంది అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన శాసన మండలి రద్దు పార్లమెంటులో ఆమోదం పొంది  ఆ తర్వాత రాష్ట్రపతి ఆర్డర్  వచ్చే వరకూ కొనసాగుతూనే ఉంటుందని అప్పటి వరకు తమ హక్కులను ఎవరూ హరించలేరు అంటూ తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: