శాసన మండలిని రద్దు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం పెడతారని తెలిసిన వేళ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, తెలుగుదేశం సభ్యులు అసెంబ్లీకి డుమ్మా కొట్టేశారు. ఆ విషయాన్ని ముందే ప్రకటించారు. జగన్ వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నందుకే డుమ్మా కొడుతున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ అసలు విషయం వేరే ఉందట. అదేంటంటే.. చంద్రబాబు గతంలో శాసన మండలి అనవసరమంటూ ఉమ్మడి ఏపీ అసెంబ్లీలోనే ప్రసంగించారు.

 

ఈ ప్రసంగాన్ని అసెంబ్లీలో ప్రదర్శించాలని వైసీపీ భావించింది. ఈ విషయం వైసీపీలోని లీకువీరుల ద్వారా చంద్రబాబుకు తెలిసిపోయిందట. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీలోకి వెళ్లి తాను గతంలో ప్రసంగించిన వీడియోలు జగన్ ప్లే చేస్తుంటే.. తల ఎక్కడపెట్టుకోవాలి.. అందుకే డుమ్మా కొట్టేశారట. ఈ ప్రసంగాల ప్రదర్శన విషయం ముందుగా తెలియకపోయి ఉంటే.. చంద్రబాబు పరువు నిట్టనిలువునా అసెంబ్లీలో పోయేదే. డుమ్మా కొట్టడం ద్వారా కాస్త పరువు దక్కిందని టీడీపీ నేతలు సంతోషపడుతున్నారు.

 

ఈ విషయంపై ఓ వైసీపీ నేత మాట్లాడుతూ.. " వైయస్‌ జగన్‌ వ్యవస్థలను మేనేజ్‌ చేసే వ్యక్తి కాదు. ప్రజల నుంచి నేరుగా ఎన్నుకోబడిన వ్యక్తి. ఏది చేయాలో దాన్ని చేస్తారు. గతంలో చంద్రబాబు మండలి రద్దుపై మాట్లాడింది మరిచిపోయారు. చంద్రబాబు ఇవాళ సభకు రాలేదు. తన వాదనను వినిపించేందుకు ఎందుకు వెనుకడుగు వేశారు. ప్రజాస్వామ్యంలో తన వాదన వినిపించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? ప్రజలకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.

 

" మేం ఎమ్మెల్సీలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేశారని మాపై తప్పుడు కథనాలు రాయించారు. ఎమ్మెల్సీలను కొని మమ్మల్ని కాపాడుకోవాల్సిన అవసరం, దుర్భుద్ది లేదు. మండలి రద్దు అయితే రద్దైన ఎమ్మెల్సీలకు చంద్రబాబు అన్ని విధాల సాయం చేస్తామని చెబుతున్నారు. ఏమిటీ దిగజారుడు రాజకీయాలు? ఇది సమంజసం కాదు. వేగవంతమైన పరిపాలన అందించాలన్నదే వైయస్‌ జగన్‌ ధ్యేయం.. అని కూడా సదరు వైసీపీ నేత అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: