మీడియా అంటే అన్ని వర్గాలను ప్రతిబింబించాలి.. అందరి సాధక బాధకాలు తెలుసుకోవాలి. చివరకు ప్రజాప్రయోజనాన్ని గీటురాయిగా తీసుకోవాలి. దాని ప్రకారం వార్తల రూపకల్పన జరగాలి. ఇదంతా ఒకప్పటి సంగతి.. కానీ ఇప్పుడు మీడియా సంస్థలు నాయకులకు ఊడిగం చేస్తున్నాయి. వారి కరపత్రాలుగా మారిపోయాయి. కాకపోతే.. దీన్ని వారు ఊడిగంగా భావించడం లేదు. తమ వాడికి చేసే సాయంగా ఫీలవుతున్నాయి.

 

ఇక తెలుగులో మీడియాను మీడియా మేనేజ్ మెంట్ కింగుగా పేరున్న చంద్రబాబుకు ఆయన అనుంగు పత్రికలు ఇప్పుడు తమ వంతు సాయం చేయడంలో అన్ని హద్దులూ చెరిపేసుకుంటున్నాయి. గతంలో ఏ వార్త జరిగినా దాన్ని చంద్రబాబుకు అనుకూలంగా ప్రజెంట్ చేయడం ఎలా అనే ఆలోచనలో ఈ ఎల్లో మీడియా సంస్థలు ఉండేవి. కానీ ఇప్పుడు రూట్ మార్చాయి.

 

తమ అధినాయకుడు ఏం మాట్లాడుతున్నాడో చూసుకుని.. దానికి సపోర్టుగా కథనాలు అల్లడం ప్రారంభించాయి. ఒక విధంగా చెప్పాలంటే.. చంద్రబాబు ప్రెస్ మీట్లలో ఏం చెబుతుంటారో దాన్నే ఇప్పుడు ఈ పచ్చ మీడియా తమ గొంతులో ప్రజలకు వినిపిస్తాయి. అంటే చంద్రబాబు ఇచ్చే ఇన్ పుట్స్ తో కథనాలు వండుతున్నాయన్నమాట.

 

ఏయ్.. రాయలసీమకు విశాఖ ఎంత దూరమో తెలుసా అని చంద్రబాబు ఓ ప్రెస్ మీట్లో జగన్ ను నిలదీస్తాడు.. అంతే.. ఇక రాష్ట్రంలో ఏమూల నుంచి విశాఖ ఎంత దూరమో ఈ పత్రికలు లెక్కలు వేసి గ్రాఫిక్కులు వేసి చూపిస్తాయి. చంద్రబాబు వాదనకు అక్షర రూపం ఇస్తాయి. ఏయ్.. అమరావతిలో ఎన్ని కట్టానో తెలుసా.. అంటూ చంద్రబాబు.. వెంటనే.. అమరావతిలో చంద్రబాబు కట్టిన బిల్డింగులతో ఓ రెండు పేజీలు పరిచేస్తాయి.

 

ఏయ్.. అమరావతిని రాజధానిగా కొనసాగించడానికి కొత్తగా ఖర్చేమీ అక్కర్లేదంటాడు చంద్రబాబు.. ఆ మరుసటి రోజో.. మరో రోజో.. అసలు పైసా ఖర్చు చేయకుండా అమరావతి నుంచి ఎలా పరిపాలన సాగించొచ్చో సవివరింగా సచిత్రంగా ప్రచురిస్తాయి ఈ బాకా పత్రికలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే. చంద్రబాబు ఆక్రోశానికి.. అక్షర రూపంగా ఆ పత్రికల కథనాలు తయారయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: