కరోనా వైరస్ ఇప్పుడు.. ప్రపంచాన్ని వణకిస్తున్న వైరస్ ఇది.. మొదట్లో దీని వల్ల చైనాకే ముప్పు అనుకున్నారు. కానీ.. ఇప్పుడు ప్రపంచం మొత్తం బెంబేలుపడిపోతోంది. పక్కనే ఉండటం వల్ల ఇండియాకు ఈ ముప్పు మరీ ఎక్కువగా ఉంది. అందుకే.. ఇప్పుడు కరోనా పేరు వింటేనే జనం వణికిపోతున్నారు. ఇప్పటికే చెన్నైలో దాదాపు 110 మంది వరకూ చనిపోయారు. మరో 300 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

 

అయితే ఈ కరోనా వైరస్ వార్తల నేపథ్యంలో ఓ బీర్ కంపెనీ తలపట్టుకుంటోంది. ఎందుకంటే ఈ కంపెనీ బీర్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. అదేంటి కరోనా వైరస్ కూ బీర్ కూ సంబంధం ఏంటనుకుంటున్నారా ? ఒకవేళ కరోనా భయంతో బీర్ల అమ్మకాలు పడిపోతే.. అన్ని బీర్ల అమ్మకాలు పడిపోవాలి కదా.. ఈ ఒక్క బీర్ అమ్మకాలే ఎందుకు పడిపోతాయ్.. ఇదేగా మీ అనుమానం కానీ.. ఇక్కడ ఈ బీర్ కంపెనీ పేరే కరోనా.. అందుకే ఈ బీరు పేరు చెబితే అంతా భయపడిపోతున్నారు.

 

సాధారణంగా ఈ కరోనా బీర్ కు చాలా డిమాండ్ ఉంది. మార్కెట్లో దొరుకుతున్న బీర్ల రేట్లకు డబుల్ ఉంటుంది. అయితే ఇప్పుడు కరోనా వైరస్ పేరు పుణ్యమా అని.. ఈ బీర్ తాగితే వైరస్ సోకుతోందేమోనని భయపడుతున్నారు మందుబాబులు. ఈ బీర్ తాగడం వల్ల వైరస్ సోకుతుందా? వ్యాధి లక్షణాలు ఏంటి? అని గూగుల్‌లో వెదుకుతున్నారు. ఒక్క ఇండియన్లే కాకుండా.. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా ప్రజలు కూడా కరోనా బీర్ వైరస్ అంటూ వెతుకుతున్నారట.

 

అయితే విచిత్రం ఏంటంటే.. కరోనా వైరస్ కూ ఈ బీర్ కు ఎలాంటి సంబంధం లేదు.. ఒక్కే పేరులో సారూప్యం తప్ప. కానీ మన జనానికి లాజిక్కులు అవసరం లేదు కదా.. ఎందుకొచ్చిన గొడవ మార్కెట్లో ఇన్ని బీర్లు ఉండగా.. ఈ బీరునే ఎందుకు తాగాలి .. రిస్క్ ఎందుకు అనుకుంటున్నారు మందుబాబులు. అందుకే ఈ బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయ్.. అదీ సంగతి.

మరింత సమాచారం తెలుసుకోండి: