నిర్భయ దోషి ముకేశ్‌ కుమార్‌ పిటిషన్‌ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. గతం లో క్షమా బిక్ష కోరుతూ రాష్ట్రపతి కి అభ్యర్థన పెట్టుకున్న నిందితుల అభ్యర్థన ను కొట్టి వేసియాన్ సంగతి తెలిసిందే. క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడా న్ని సవాల్‌ చేస్తూ ముకేశ్‌  రీ పిటిషన్‌ దాఖలు చేశాడు. ముకేశ్‌ పిటిషన్‌ ను జస్టిస్‌ భానుమతి ధర్మాసనం తాజాగా కొట్టి వేసింది.అన్ని అనుబంధ పత్రాలను రాష్ట్రపతి కి ప్రభుత్వం పంపించిందని సుప్రీంకోర్టు తెలిపింది. నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు తీహార్‌ జైలు అధికారులు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. 

 

వివరాల్లోకి వెళితే.. ‘నిర్భయ’దోషి ముఖేశ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ను  కొట్టివేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. క్షమాభిక్ష అభ్యర్థన పై రాష్ట్రపతి ఈ నిర్ణయా న్ని తీసు కున్నారని అందులో భాగంగానే తిరస్కరించినట్లు తెలుస్తుంది. అయితే ఒక వ్యక్తి జీవితా నికి సంబంధించిన అంశంపై ఇంత త్వరగా నిర్ణయం తీసు కోవడం తగదని, దీని పై మనసు పెట్టాలని దోషి తరఫు న్యాయ వాది అంజనా ప్రకాశ్‌ వాదించారు.కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. మరణశిక్షను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందని ఆయా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 

 

మహిళాను అత్యాచారం కేసు లో నిందితులు గా ఉన్న వీరు ఇతర ఖైదీలతో  ప్రవర్తన సరిగా లేదని, ఆ కారణం చేతనే ఈ తీర్పు త్వరగా వచ్చిందని పేర్కొన్నారు.మరోవైపు, దోషి తరఫున అంజనా ప్రకాశ్‌ వాదిస్తూ.. ముఖేశ్‌పై జైలులో లైంగికదాడి జరిగిందని ఆరోపించారు.ఈ ఆరోపణలను తుషార్‌ మెహతా ఖండించారు. కేంద్ర హోం శాఖ అన్ని వివరాలను రాష్ట్రపతికి పంపించిందన్నారు. ముఖేశ్‌ను ఒంటిరిగా ఉంచలేదని చెప్పారు. ఫిబ్రవరి 1 న వీరికి ఉరి శిక్షను ఖరారు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: