ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని ఇళ్లు లేని పేద మహిళలకు శుభవార్త చెప్పారు. అధికారులకు ఇళ్ల పట్టాలను మహిళల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు.ఏపీ సీఎం జగన్ నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సచివాలయం నుండి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ మహిళల పేర్ల మీదే చేయించాలని సూచించారు. 
 
అధికారులకు ఫిబ్రవరి నెల 15వ తేదీలోగా ఇళ్ల పట్టాల అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సూచనలు చేశారు. ప్రజా సాధికారిక సర్వేకు, ఇళ్ల పట్టాలకు ఎటువంటి లింక్ పెట్టవద్దని సీఎం జగన్ సూచనలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల పట్టాలతో మహిళల ముఖాల్లో సంతోషం నింపాలని సీఎం జగన్ చెప్పారు. సీఎం జగన్ 25 లక్షల మహిళల పేర్లతో 10 రూపాయల స్టాంపు పేపర్లపై ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సూచించారు. 
 
ఇళ్ల స్థలాల కేటాయింపు లాటరీ పద్ధతి ద్వారా చేయాలని సూచనలు చేశారు. గ్రామాలలో తాను పర్యటించే సమయంలో ఎవరికైనా ఇళ్ల పట్టాలు అందలేదా..? అని అడిగితే ఎవరూ చేయెత్తకూడదని చెప్పారు. మెజారిటీ ప్రజల అంగీకారం మేరకే ఇళ్ల పట్టాల స్థలాలను ఎంపిక చేయాలని చెప్పారు. మనకు ఓటు వేసినా వేయకపోయినా పరవాలేదని వారికి మంచి జరిగితే చాలని జగన్ అన్నారు. 
 
స్పందన కార్యక్రమంలో 60 శాతం ఫిర్యాదులు పెన్షన్, రేషన్, ఇళ్ల పట్టాలకు సంబందించినవేనని జగన్ చెప్పారు. వాలంటీర్ల ద్వారా ఇంటికే పింఛన్లు అందించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1వ తేదీ నుండి ప్రారంభిస్తామని చెప్పారు. ఫిబ్రవరి రెండవ వారం నుండి కొత్త బియ్యం కార్డుల, కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని జగన్ చెప్పారు. గ్రామ సచివాలయాల ద్వారా 541 రకాల సేవలు ప్రజలకు అందించనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: