ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత మధ్యపాన నిషేధం దిశగా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించటంతో పాటు గతంతో పోలిస్తే మద్యం రేట్లు కూడా భారీగా పెరిగాయి. కానీ ఏపీ శివారులో ఉన్న తెలంగాణ జిల్లాల నుండి కొందరు అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నట్టు అప్పుడప్పుడూ వార్తలు వినిపిస్తున్నాయి. 
 
ఈ విషయం ప్రభుత్వం దృష్టికి కూడా రావడంతో ప్రభుత్వం చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అక్రమంగా మద్యం తరలించకుండా చర్యలు తీసుకుంటోంది. కానీ తెలంగాణ రాష్ట్రం నుండి ఏపీకి ప్రయాణించేవారిలో కొందరు తెలంగాణలో మద్యం కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. తాజాగా ఏపీ ఆర్టీసీ బస్సు డ్రైవర్ చేసిన ఘనకార్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్టీసీ బస్ డ్రైవర్లు విధుల్లో ఉన్న సమయంలో కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. 
 
బస్సులో ప్రయాణించే ప్రయాణికుల ప్రాణాలు బస్సు డ్రైవర్ పైనే ఆధారపడి ఉంటాయి. కానీ ఆ ఆర్టీసీ డ్రైవర్ మాత్రం కోదాడ జాతీయ రహదారిపై ఒక మద్యం షాపు ముందు బస్సును ఆపాడు. ఆ తరువాత బస్సులో నుండి డ్రైవర్ పక్కనే ఉన్న కుర్రాడు దిగి మద్యం షాపుకు వెళ్లి మద్యం బాటిల్ ను కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఆ బాటిల్ ను డ్రైవర్ తన పక్కన పెట్టుకున్నాడు. హైదరాబాద్ నుండి అమలాపురం వెళ్లే ఏపీ ఆర్టీసీ బస్సును డ్రైవర్ ఆపగా బస్సులో ప్రయాణికులు ఏమైనా ట్రబుల్ వచ్చిందేమో అని అనుకున్నారు. 
 
డ్రైవర్ పక్కనే కూర్చున్న కుర్రాడు బస్సు దిగి మద్యం బాటిల్ ను కొనుగోలు చేసి డ్రైవర్ కు ఇచ్చాడు. బస్సులోని ప్రయాణికులు ఈ తతంగాన్ని మొబైల్ లో వీడియో తీశారు. కానీ డ్రైవర్ ఏ మాత్రం భయపడలేదు. డ్రైవర్ బాధ్యత లేకుండా ప్రవర్తించాడని డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడని గ్యారంటీ ఏమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికులు డ్రైవర్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: