తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత అత్యాచారం, హత్య కేసుకు సంబంధించిన తుది తీర్పును సంచలనాత్మకరంగా ఇచ్చింది. ముగ్గురు నిందితులు ఉరిశిక్షను ఖరారు చేసి సంచలనంగా మారింది. అయితే దిశ కేసు కంటే నాలుగురోజులు ముందు జరిగిన ఈ కేసు తుది తీర్పు నేడు వెలువడింది. 

 

నవంబర్ 24వ తేదీన అదిలాబాద్ జిల్లాలోని ఎల్లపటూర్ లో సమత కనిపించకుండా పోయింది. సమత ఏ రోజు అయితే అదృశ్యమైందో ఆ రోజున ముగ్గురు నిందితులు సమతను అత్యాచారం చేయడంతో పాటు దారుణంగా హత్య చేశారు. దీంతో ఈ విషయంపై సమత భర్త గోపి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

అయితే సమతా హత్యాచారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరపగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత ఈ కేసులో త్వరగా తీర్పు వెలువడాలని ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. అయితే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరగగా సమత హత్యాచారం సంబంధించిన వాదనలు ఈ నెల 20న ముగిసాయి. 

 

అయితే.. అనంతరం ఈ కేసు తీర్పు ఈ నెల 27న అంటే మూడు రోజుల ముంది తీర్పు రావాల్సి ఉంది.. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల తీర్పు ఈ నెల 30కు వాయిదా పడింది. అయితే ఆ కేసు తీర్పు నేడు వెలువడింది.. ముగ్గు నిందితులు అయినా షేక్ మగ్దూమ్, షేక్ షాబుద్దీన్, షేక్ బాబా లింగాపూర్లకు నేడు ఉరి శిక్ష ఖరారు అయ్యింది. 

 

కోర్ట్ తీర్పుపై బాధితురాలి తరుపు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేసారు. అయితే నిందితులు మాత్రం తీర్పు విని కళ్లనీళ్లు పెట్టుకున్నట్టు సమాచారం. అయినప్పటికీ ఈ నిందితులకు ఉరి శిక్ష అయితే ఫాస్ట్ గానే పడింది కానీ మళ్ళి ఈ ఉరి శిక్ష ఖచ్చితంగా వాయిదా పడుతుంది.. అంతలోపు వీళ్ళు మళ్ళి పిటిషన్ వేస్తారు.. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు అని నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: