మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండలి రద్దు విషయంలో జగన్ కు ఊహించని షాక్ ఇవ్వబోతున్నారా...? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. మండలి రద్దును అడ్డుకోవడం కొరకు చంద్రబాబు సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నాడని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలను బీజేపీలో చేర్చటం ద్వారా మండలి రద్దును చంద్రబాబు అడ్డుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
2019 ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు నాయుడుకు ఎంతో ఆప్తులైన రాజ్యసభ ఎంపీలు బీజేపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చంద్రబాబు సూచనల మేరకే రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారని ఎంపీలు బీజేపీలో  చేరడం చంద్రబాబు ప్రణాళికే అని వార్తలు వచ్చాయి. బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు కూడా టీడీపీ కోవర్టులుగా పని చేస్తున్నారని ఆరోపణలు కూడా తరచుగా వినిపిస్తూ ఉన్నాయి. 
 
బీజేపీ పార్టీలోకి టీడీపీ నేతలను పంపి చంద్రబాబు తన వ్యూహాలను అమలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలను బీజేపీలో చేర్చి ఆ తరువాత బీజేపీ మండలి రద్దు దిశగా అడుగులు వేస్తే బీజేపీ పార్టీకే నష్టం అనేలా బాబు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మండలి రద్దును ఆపడం కోసం చంద్రబాబు ఈ ప్రణాళికను అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. 
 
తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం 30 మంది ఎమ్మెల్సీలు ఉండగా సగానికి పైగా ఎమ్మెల్సీలను చంద్రబాబు బీజేపీలోకి పంపడం... ఆ తరువాత మండలి రద్దు దిశగా అడుగులు పడకుండా బాధ్యతలను బీజేపీకే వదిలేయడం... ఇదే చంద్రబాబు ప్రణాళిక అని తెలుస్తోంది. ఈ ప్రణాళికను అమలు చేయడం ద్వారా తన కుమారుడు లోకేష్ ఎమ్మెల్సీ పదవిని కూడా కాపాడుకోవచ్చని చంద్రబాబు చేస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఈ వ్యూహాన్నే అమలు చేస్తాడో మరో కొత్త వ్యూహాన్ని అమలు చేస్తాడో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: