కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.. దీంతో దేశప్రజలంత ఈ బడ్జెట్ కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అలాంటి ఈ బడ్జెట్ పై ఎన్నో ఊహాగానాలు నెలకొన్నాయి. ఎంతో ఎన్నో విధాలుగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బడ్జెట్ గురించి కొందరు నెటిజన్లు తనదైన శైలిలో పెట్టారు. 

 

అది ఏంటి అంటే.. దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోంది. 2019 ఆగస్టులో 3% ఉన్న ద్రవ్యోల్బణం నవంబర్‌కల్లా 10%కి, డిసెంబర్‌కి 14%కి చేరి ఆరేళ్ల గరిష్ఠ రికార్డును బద్దలు కొట్టింది. ముఖ్యంగా కూరగాయల ధరలు 60%, పప్పు దినుసుల ధరలు 15%కి పైగా పెరిగాయి. వినియోగదారుడి చేతుల్లో ఉన్న కాస్త డబ్బునూ తిండి కోసమే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండటంతో మిగతా రంగాల డిమాండ్‌ మరింత కుచించుకుపోతోంది.

 

మొన్నటికి మొన్న.. ఎంత భారీ వర్షాలు వస్తే మాత్రం.. కేజీ ఉల్లిపాయలు 300 రూపాయిల ? పప్పు, చక్కర.. ఆకుకూరలు.. ఆఖరికి పిల్లాడి చేతిలో ఉండే బిస్కెట్ ప్యాకెట్లు కూడా దారుణంగా పెరిగిపోయాయి. గత సంవత్సరం ఆగస్టులో 3% ఉన్న ద్రవ్యల్బణం నవంబర్ నెలకు అంత 10 శాతం కు పైగా డిమాండ్ అంటే 14 శాతం పెరిగింది. 

 

కేవలం నాలుగు నెలల్లో ఆరేళ్ళ గరిష్ట స్థాయికి పెరగడమే? ఆశ్చర్యకరమైన విషయమే కదా ? అటు పేద వాళ్ళు ఏమో రేషన్ బియ్యం.. రేషన్ సరుకులతో జీవనం ఎలాగోలా గడిపేస్తున్నారు.. ఇటు పెద్దవాళ్ళు అంటే ధనవంతులు ఏమో రిలియన్స్ మార్కెట్, రత్నదీప్ సూపర్ మార్కెట్, మోర్ అని అనే ఏసీ మార్కెట్లలో కూరగాయల ధరలు కూడా తెలియకుండా బిల్ ఎంత అయితే అంత ఇస్తారు. 

 

అటు ఇటు కాకుండా.. భార్య ఇచ్చిన సరుకుల లిస్ట్ ను, కూరగాయల లిస్ట్ ను పట్టుకొని బయటకు వెళ్లే సామాన్యుడికి కనిపిస్తాయి చుక్కలు.. ఏ ధర పెరిగిన సామాన్యుడి మీదే పడుతుంది. అందుకే సామాన్యుల నోటి నుండి ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ద్ర‌వ్యోల్బ‌ణంకు బ్రేక్ ఏది అని? మరి ఈ బడ్జెట్ ఎం తేలుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: