ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత సీఎం జగన్ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. నెలరోజుల క్రితం మూడు రాజధానుల గురించి నిర్ణయం తీసుకొని మూడు రాజధానుల దిశగా ముందడుగు వేస్తున్న జగన్ మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అరకు, మచిలీపట్నం, గురజాలలో సీఎం జగన్ మూడు కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. 
 
కొన్ని రోజుల క్రితం జరిగిన కేబినేట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే సీఎం జగన్ కృష్ణా జిల్లాకు ఎన్టీయార్ పేరు పెడతానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటు కాబోయే మచిలీపట్నం జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. 
 
ఈ మేరకు అధికారికంగా అతి త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్టీయార్ సొంత నియోజకవర్గమైన గుడివాడ కూడా మచిలీపట్నం జిల్లాలో చేరే అవకాశం ఉండటంతో ఎన్టీయార్ అభిమానుల నుండి కూడా ఈ నిర్ణయంపై సంతృప్తి వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. మచిలీపట్నం జిల్లాకు ఎన్టీయార్ పేరు పెడితే జగన్ ఒక రకంగా చంద్రబాబుకు షాక్ ఇచ్చినట్టే అని చెప్పవచ్చు. 
 
14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఏరోజు కృష్ణా జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టే దిశగా చర్యలు తీసుకోలేదు. కానీ సీఎం జగన్ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ ఆ పార్టీని స్థాపించిన ఎన్టీయార్ పేరును ఒక జిల్లాకు పెట్టడం గమనార్హం. మచిలీపట్నంకు ఎన్టీఆర్ పేరు పెడితే తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో కూడా జగన్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం కావాటంతో పాటు టీడీపీ అభిమానులు జగన్ కు అభిమానులుగా మారే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: