నిర్భయ అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిర్భయ అత్యాచారం, హత్య కేసు నిందితులకు న్యాయస్థానం ఉరిశిక్ష ప్రకటించిన తరువాత కూడా ఎన్నో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. నలుగురు దోషులు ఉరిశిక్ష అమలు కాకుండా స్టే విధించాలని ఢిల్లీ కోర్టును అభ్యర్థించారు. కానీ ప్రస్తుతం ఒకరి క్షమాభిక్ష పిటిషన్ మాత్రమే పెండింగ్ లో ఉండటంతో మిగతా ముగ్గురు నిందితులకు మాత్రం ఉరిశిక్ష పడనుంది. 
 
నిజానికి ఢిల్లీ కోర్టు ఆదేశాల ప్రకారం నలుగురు దోషులకు ఉరి తీయాల్సి ఉంది. కానీ నిందితులలో ఒకరైన వినయ్ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోవడంతో కేసు కీలక మలుపు తిరిగింది. కానీ ఉరిశిక్షపై స్టే విధించాలని న్యాయవాది ఏపీ సింగ్ పటియాలా కోర్టులో పిటిషన్ ను దాఖలు చేయగా న్యాయస్థానం ఆ పిటిషన్ ను నేడు విచారణ చేపట్టింది. న్యాయవాది ఏపీ సింగ్ దోషులు ఉగ్రవాదులు కాదని నిరవధికంగా కేసు వాయిదా వేయాలని దోషులకు న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునే చూడాలని అభ్యర్థించారు. 
 
జైలు అధికారులు మాత్రం ముగ్గురు నిందితులను ఉరి తీయటానికి ఎటువంటి అడ్డంకులు లేవని ప్రస్తుతం ఒక్క దోషి పిటిషన్ మాత్రమే పెండింగ్ లో ఉందని దోషుల తరపు న్యాయవాది వాదనలతో విబేధించారు. ప్రభుత్వం నలుగురినీ ఒకేసారి ఉరి తీయాలని నిబంధన ఏమీ లేదని మిగిలిన ముగ్గురినీ ఉరి తీయొచ్చని కేంద్రం చెబుతోంది. ఉరిశిక్ష సమయం దగ్గర పడుతున్న కొద్దీ దోషులు తప్పించుకోవడానికి రకరకాల ప్రణాళికలు రచించారు. 
 
మరోవైపు పవన్ గుప్తా పిటిషన్ ను దాఖలు చేయగా ఆ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. సుప్రీం ఈ సందర్భంగా గతంలో తాము ఈ పిటిషన్ ను తిరస్కరించడం జరిగిందని పదేపదే పిటిషన్ వేయడం సరికాదని కోర్టు పేర్కొంది. ఇప్పటి వరకు ముగ్గురు నిర్భయ నిందితులు వేరువేరుగా క్యురేటివ్ పిటిషన్లు వేయగా న్యాయస్థానం ఆ పిటిషన్లను కొట్టివేసింది. మరోవైపు ఉరిశిక్ష అమలు చేయటానికి తీహార్ జైలులో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: