నిర్భయ దోషుల ఉరితీత  కేసులో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ ను దాఖలు చేశారు. తనకు మరణ శిక్ష విధించారని మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని వినయ్ శర్మ కోరారు. మరోవైపు పవన్ గుప్తా రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీం కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. 
 
కేంద్ర ప్రభుత్వం తాజాగా వినయ్ శర్మ క్షమాభిక్ష కోసం అభ్యర్థించిన నేపథ్యంలో ముగ్గురు దోషులను ఉరి తీయటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టు తెలిపింది. వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ విషయంలో రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. వినయ్ శర్మ కోరినట్టు రాష్టపతి మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తారా..? లేదా...? చూడాల్సి ఉంది. 
 
వినయ్ శర్మ పిటిషన్ విషయంలో రాష్ట్రపతి ఎలాంటి తీసుకుంటారో అని దేశవ్యాప్తంగా టెన్షన్ నెలకొంది. మరోవైపు పట్టియాలా కోర్టు వీరి ఉరిపై స్టేను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులను ఇచ్చేవరకు ఉరిని వాయిదా వేస్తున్నట్టు కోర్టు వెల్లడించింది. నిర్భయ నిందితులు మరోసారి 
ఉరి నుండి తప్పించుకోవటం గమనార్హం. వినయ్ శర్మ రాష్టపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవడంతో ఉరి వాయిదా పడింది. 
 
వాస్తవానికి జనవరి 22వ తేదీనే నిర్భయ దోషులకు ఉరి తీయాల్సి ఉండగా తొలిసారి స్టే విధించారు. ఆ తరువాత ఫిబ్రవరి 1వ తేదీన డెత్ వారంట్ జారీ చేయగా మరోసారి కోర్టు స్టే విధించింది. మరోవైపు నిర్భయ కేసులో తాను మైనర్ నంటూ పవన్ గుప్తా మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించగా సుప్రీం పిటిషన్ ను కొట్టివేసింది. వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ పై రాష్ట్రపతి నిర్ణయం వెలువడిన తరువాత ప్రభుత్వం ఉరిశిక్ష తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: