ఒకప్పుడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన దగ్గుబాటి ఫ్యామిలీ...ఇప్పుడు రాజకీయాల్లో అడ్రెస్ లేని పరిస్తితికి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. దగ్గుబాటి వెంకటేశ్వరావు, ఆయన తనయుడు హితేష్ చెంచురామ్‌లు పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండగా,  దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం బీజేపీతో బండి లాగించేస్తున్నారు. అయితే బీజేపీకి రాష్ట్రంలో అంత సీన్ లేదు కాబట్టి పురంధేశ్వరికి..ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న మాదిరిగా రాజకీయ భవిష్యత్ రావడం అనేది చాలా కష్టం. కాకపోతే కేంద్రం ఏమన్నా దయ తలిస్తే, ఏదైనా కీలక పదవి వచ్చే అవకాశముంది.

 

ఇక పురంధేశ్వరి విషయం పక్కనబెడితే...దగ్గుబాటి వెంకటేశ్వరావు ఇక పూర్తిగా రాజకీయాలకు దూరమైపోయారనే చెప్పొచ్చు. అయితే ఆయన దూరమైన కుమారుడు భవిష్యత్ మాత్రం నిలబెట్టడానికి ప్రయత్నాలు చేయాలి. అసలు అలా ప్రయత్నం చేసే ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత పురంధేశ్వరి కాంగ్రెస్ వదిలి బీజేపీలో చేరిన, దగ్గుబాటి మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ కుమారుడు భవిష్యత్ కోసమని చెప్పి, 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. చేరడమే కాకుండా కొడుకు హితేష్‌కు పర్చూరు టికెట్ ఇప్పించుకున్నారు.

 

కానీ హితేష్ అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడం వల్ల ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయారు. దీంతో దగ్గుబాటే స్వయంగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఓడిన దగ్గర నుంచి నియోజకవర్గాన్ని గాలికొదిలేశారు. ఈ క్రమంలోనే జగన్...ఎన్నికల ముందు టీడీపీలోకి వెళ్ళిన రావి రామనాథంబాబుని మళ్ళీ తీసుకొచ్చి, పర్చూరు పగ్గాలు అప్పగించారు. అటు పురంధేశ్వరి బీజేపీలో ఉండటం, దగ్గుబాటి వైసీపీలో ఉండటం నచ్చక, జగన్ ఇద్దరు ఒకే పార్టీలో ఉండాలని కోరారు. పురంధేశ్వరి మాత్రం బీజేపీని వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడంతో దగ్గుబాటి, ఆయన తనయుడు హితేష్ రాజకీయాల్లో సైలెంట్ అయిపోయారు.

 

అయితే హితేష్ భవిష్యత్ మాత్రం గందరగోళంలో పడింది. దగ్గుబాటి రాజకీయాలకు దూరమైన కుమారుడుకు మాత్రం ఓ భవిష్యత్ ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. వైసీపీలో ఎలాగో ఉండలేరు కాబట్టి..బీజేపీలోకి పంపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. కాకపోతే బీజేపీకి ఏపీలో భవిష్యత్ ఉంటుందని చెప్పలేమని, కాబట్టి హితేష్‌ని టీడీపీలోకి పంపిస్తే బెటర్ అని దగ్గుబాటి అనుచర వర్గాలు భావిస్తున్నాయట. ఇప్పుడు కాకపోయిన వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితుల బట్టి పంపితే బాగుంటుందని అనుచరులు లోలోపల చర్చలు చేసుకుంటున్నారని టాక్. మరి చూడాలి దగ్గుబాటి వారసుడు భవిష్యత్ ఎలా ఉండనుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: