ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. 2009 ఎన్నికల్లో ఈ పార్టీ 18 స్థానాలలో విజయం సాధించింది. పార్టీ పెట్టిన మూడేళ్ల తరువాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ తరువాత కాలంలో చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ 2009 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించడం 2014లో టీడీపీకి మద్దతు ఇవ్వటం టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కూడా పరోక్షంగా కారణం కావడం తెలిసిందే. 
 
2019 ఎన్నికలలో మాత్రం జనసేన బీఎస్పీ, వామపక్షాలతో కలిసి ఏపీలో పోటీ చేయగా జనసేన పార్టీ నుండి ఒక అభ్యర్థి మాత్రమే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండు స్థానాల నుండి పోటీ చేసినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా గెలవలేదు. 2019 ఎన్నికలలో జనసేన పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. తాజాగా జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు స్పష్టం చేశారు. 
 
కానీ తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం బీజేపీలో జనసేన పార్టీ అతి త్వరలో విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల తరువాత జనసేన పార్టీ ముఖ్య నేతలు పార్టీని వీడారు. తాజాగా సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ కూడా పార్టీ వీడిన విషయం తెలిసిందే. జనసేనలో నెంబర్ 2 గా ఉన్న లక్ష్మీనారాయణ కూడా పార్టీని వీడటంతో జనసేన పార్టీ భవిష్యత్తుపై కూడా సందేహాలు నెలకొన్నాయి. 
 
మరోవైపు పవన్ కూడా వరుస సినిమా కమిట్మెంట్లతో సినిమాల్లో బిజీ అయిపోయారు. పవన్ తో ఇప్పుడు కేవలం నాదెండ్ల మనోహర్ మాత్రమే మిగిలి ఉన్నారు. నాదెండ్ల మనోహర్ కు మాత్రమే పవన్ అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన జనసేన పార్టీ నుండి నేతలు ఒకొక్కరు పార్టీకి దూరమవుతున్నట్టు సమాచారం. బీజేపీతో కలిసి జనసేన ముందుకు సాగాలనుకోవడంతో అతి త్వరలో జనసేన బీజేపీలో విలీనం అవుతుందని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యకమవుతున్నాయి. అన్న మూడేళ్ల తరువాత పార్టీని విలీనం చేశాడని తమ్ముడు ఆరేళ్ల తరువాత పార్టీని విలీనం చేయనున్నాడని జనాలు అనుకుంటూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: