కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కేంద్రం బడ్జెట్ లో విద్యారంగానికి తగిన ప్రాధాన్యతను ఇచ్చింది. భారతదేశంలో చదువుకోవాలనుకునే ఇండియా విద్యార్థుల కోసం కేంద్రం ఇండ్ శాట్ అనే కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. విదేశీ పెట్టుబడులకు విద్యా రంగంలో కేంద్రం ఆహ్వానం పలకనుంది. నేషనల్ ఫోరెన్సిక్ వర్సిటీ, నేషనల్ పోలీస్ వర్సిటీలను కేంద్రం ఏర్పాటు చేయనుంది. 
 
150 యూనివర్సిటీలలో 2026 సంవత్సరం నాటికి కేంద్రం కోత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొనిరానుంది. మెడికల్ కాలేజీలను కేంద్రం జిల్లా ఆస్పత్రులతో అనుసంధానం చేయనుంది. కేంద్రం విద్యారంగం కోసం ఏకంగా 99,300 కోట్ల రూపాయలను కేటాయించింది. విద్యార్థులు చదువుకు దూరం కాకుండా కేంద్రం ఆన్ లైన్ లోనే డిగ్రీని చదువుకునే అవకాశాన్ని కల్పించనుంది. 
 
కానీ ఆన్ లైన్ ద్వారా డిగ్రీ చదువుకోవాలంటే కొన్ని షరతులు ఉంటాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ విధానం దేశంలోని అన్ని విద్యాలయాల్లో అందుబాటులో ఉండదని కేవలం దేశంలో ఖ్యాతిగాంచిన 100 విశ్వవిద్యాలయాలలో మాత్రమే ఉంటుందని చెప్పారు. ఫోరెన్సిక్ విశ్వ విద్యాలయాన్ని, పోలీస్ విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలాసీతారామన్ తెలిపారు. 
 
కేంద్రం బడ్జెట్ లో విద్యా రంగానికి మాత్రం తగిన ప్రాధాన్యతను ఇచ్చారనే చెప్పాలి. ఆన్ లైన్ డిగ్రీని ప్రవేశపెడుతూ ఉండటం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని పేరుగాంచిన 100 జాతీయ విశ్వవిద్యాలయాలలో మాత్రమే ఈ విధానాన్ని ప్రవేశపెడుతూ ఉండటంతో ఈ విధానం పకడ్బంధీగా అమలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.                                           

మరింత సమాచారం తెలుసుకోండి: