ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి 8 నెలలు అయింది. ఓ వైపు సీఎం జగన్ ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలు అందిస్తూ...పాలనలో దూసుకెళుతున్నారు. మరోవైపు జగన్ 8  నెలల్లోనే సీఎంగా ఫెయిల్ అయ్యారని, ఇప్పటికే పలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని తిరోగమనం దిశలో నడిపిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు చేస్తూ, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూడు రాజధానులు, అమరావతి అంశాలు రాజకీయాన్ని నడిపిస్తున్నాయి.

 

జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు అంటుంటే...చంద్రబాబు అమరావతి అంటున్నారు. ఇక ప్రజలు వీరిలో ఎవరి వైపు ఉన్నారో అర్ధం కాకుండా ఉంది. అయితే అసలు జనం ఎవరివైపు ఉన్నారనేది ఒక ఎన్నికలు మాత్రమే డిసైడ్ చేయగలవు. కాబట్టి రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టం కానుంది. పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ఏ పార్టీ సత్తా ఏంటో తేల్చేస్తాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ప్రజల రెఫరెండం తెలుస్తుంది. 

 

కాకపోతే ఒక్కసారి 2019 ఎన్నికలని గురించి మాట్లాడితే, వైసీపీకి 151 సీట్లు, టీడీపీకి 23 సీట్లు, జనసేనకు ఒక సీటు వచ్చింది. ప్రస్తుతం టీడీపీకి చెందిన ఇద్దరు, జనసేనకు చెందిన ఒక ఎమ్మెల్యే వైసీపీకే మద్ధతు తెలుపుతున్నారు. దీని బట్టి చూసుకుంటే లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. దాదాపు 90 శాతం వరకు అనుకూల ఫలితాలు వస్తాయి. కానీ మూడు రాజధానులతో పరిస్తితి కొంచెం మారినట్లు తెలుస్తోంది.

 

అయితే మెజారిటీ ప్రజలు మాత్రం మూడు రాజధానులు వైపే ఉన్నారని అర్ధమవుతుంది. అదే సమయంలో అమరావతి దగ్గరగా ఉన్న జిల్లాలు కాస్త టీడీపీకి పాజిటివ్‌గా ఉన్నాయని చర్చ నడుస్తుంది. దీని బట్టి చూసుకుంటే వార్ వన్‌సైడ్ జరగడం కష్టమే అని విశ్లేషణలు బయటకొస్తున్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన, కోస్తాలో కాస్త పోటీ ఎదురుకోవాలని రాజకీయ విశ్లేషుకులు అంటున్నారు. అందులోనూ కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాలో వైసీపీ-టీడీపీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని చెబుతున్నారు. మరి చూడాలి ఈ లోకల్ వార్ ఎలా ఉండబోతుందో?

 

మరింత సమాచారం తెలుసుకోండి: