ఎన్నికల్లో చాలా మంది చాలా వాగ్దానాలు చేస్తారు.. ఆకాశంలో చుక్కలు నేలకు దించుతామంటారు. కొండ మీది కోతిని తెస్తామంటారు. కానీ ఎన్నికలయ్యాక అవేవీ గుర్తుండవు. కానీ.. జగన్ మాత్రం ఎన్నికల ప్రణాళికే బైబిల్, ఖురాన్, భగవద్గీతలా ముందుకు కదులుతున్నాడు. కొన్ని దశాబ్దాలుగా ఏపీలో సంక్షేమ పథకాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పుడు జగన్ వాటిని మరింతగా పరుగులు పెట్టిస్తున్నాడు.

 

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ప్రభుత్వ సేవలు పేదల ఇంటికే చేరుతున్నాయి. ప్రభుత్వం అందించే పింఛన్లు తీరు ఇంతకాలం ఓరకంగా ఉండేవి. ఆఫీసుల దగ్గర పడిగాపులు పడే పరిస్థితి వుండేది. ఒక్కోసారి రెండు మూడు రోజులు కూడా పట్టేది. ఈసురోమంటూ అందుకోవాల్సిందే. కానీ ఇప్పుడు సీన్ మారింది. దేశంలోనే ఎక్కడా లేని తీరులో, దేశచరిత్రలోనే తొలిసారి పింఛన్లు లబ్దిదారుల ఇంటికే నడిచొస్తున్నాయి.

 

వైఎస్సార్‌ పింఛను పథకంలో భాగంగా ఫించన్లు వారి ఇళ్ల వద్దకే గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా అందుతున్నాయి. 54 లక్షలకు పైగా పించన్లు ఇలా అందుతున్నాయి. మనసున్న వాడు పాలకుడైతే పేదింటి గడపగడపకూ భరోసా అందుతుందని ఈ ఇంటికి ఫింఛన్ సీన్ మరోసారి చాటి చెబుతోంది. నడుం వంగిపోయిన అవ్వ గడప దగ్గరకే నడిచెళ్లి పింఛను అందింది. నడవలేక మంచం పట్టిన దివ్యాంగుల చెంతకెళ్లి ఇదిగో నీకు చేయూత అంటూ పింఛను పలికింది.

 

వృద్దాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛనుదారులందరికీ వలంటీర్ల ద్వారా నేరుగా ఇంటి వద్దనే పింఛను డబ్బులు పంపిణీ చేస్తున్నారు. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ లబ్దిదారుల నుద్దేశించిన రాసిన లేఖ ఆత్మీయతను కనబరిచింది. అవ్వాతాతలు, పేదలు పడుతున్న ఆర్ధిక ఇబ్బందులను ప్రజా సంకల్పయాత్రలో చూసి చలించిపోయానన్న జగన్.. అందుకు మానవీయ పరిష్కారం చూపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: