అతను ఓ కండక్టర్... గత నాలుగు రోజులుగా ఈ కండక్టర్ కలెక్టర్ కాబోతున్నాడని విపరీతంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కండక్టర్ స్థాయి నుండి కలెక్టర్ కావడం కొరకు రోజుకు ఐదు గంటల పాటు కష్టపడ్డానని సివిల్స్ పరీక్షల్లో క్వాలిఫై అయ్యానని ఇంటర్వ్యూలో విజయం సాధిస్తే కలెక్టర్ అవుతానని మధు మీడియాతో చెప్పాడు. రోజుకు 8 గంటలు కష్టపడి ఉద్యోగం చేసి 5 గంటలు ప్రిపేరై సివిల్స్ క్వాలిఫై అయ్యాడని ప్రముఖ వార్తా పత్రికలు అతని గురించి విపరీతంగా ప్రచారం చేశాయి. 
 
ఆ వార్తను నమ్మిన ప్రజలు కూడా అతను కలెక్టర్ కావాలని కోరుకుంటున్నామని అతనికి శుభాకాంక్షలు తెలిపారు. కానీ అసలు నిజం ఏమిటంటే ఆ కండక్టర్ కండక్టరే.... అందరికీ చెప్పినట్టు అతను సివిల్స్ పరీక్షల్లో క్వాలిఫై కాలేదు. కానీ తనకు తాను తాను సివిల్స్ పరీక్షల్లో క్వాలిఫై అయ్యానని తను చుట్టూ ఉన్నవారిని, మీడియాను నమ్మించగా ఇలాంటి విషయాలలో ఎవరూ అబద్ధం చెప్పరులే అనుకొని మీడియా కూడా మంచి హెడ్ లైన్లు పెట్టి వార్తలను ప్రచురించింది. 
 
కానీ అబద్ధం చెప్పిన మధు కేసులో అసలు నిజం నిలకడ మీద తెలిసింది. ముంబాయి మిర్రర్ కు చెందిన ఒక జర్నలిస్ట్ కు ఎందుకో సందేహం వచ్చి ఇంటర్వ్యూకు ఎంపికయిన జాబితా పరిశీలించగా కండక్టర్ అబద్ధం చెబుతున్నాడని అర్థమైంది. ఆ జాబితాలో మధు కుమార్ అనే పేరుతో ఎవరూ లేరు కానీ మధు కుమారి అనే పేరుతో మాత్రం ఒక యువతి ఇంటర్వ్యూకు ఎంపికైంది. ఆ తరువాత ముంబై మిర్రర్ పత్రిక సోషల్ మీడియాలో మధుకు సంబంధించిన వార్తలను తొలగించింది. 
 
 అసలు నిజం వెలుగులోకి రావడంతో ఇప్పటివరకు ప్రశంసలు పొందిన మధును ఇప్పుడు సహోద్యోగులే విమర్శిస్తున్నారు. ఇలాంటి వ్యవహార శైలి మంచిది కాదని మధును తిడుతున్నారు. కలెక్టర్ కాబోతున్నానని అందరికీ చెప్పిన మధుపై బీఎంటీసీ యాజమాన్యం చర్యలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మధు నిజ స్వరూపం తెలియడంతో నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కండక్టర్ హోదాలో ఉన్న మధు కలెక్టర్ కాబోతున్నానని ప్రజలను, మీడియాను మోసం చేయడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: