నగరి వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజాకు మంత్రి పదవి రాకుండా కొందరు కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ లేడీ ఎమ్మెల్యేలలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజాకు ఆమె ఆవేశమే మైనస్ గా మారుతోందని వైసీపీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీపై, తెలుగుదేశం పార్టీ నేతలపై ఘాటుగా విమర్శలు చేసి నెగెటివిటీ తెచ్చుకున్న రోజా ఇప్పుడు సొంత పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆమెపై పార్టీలో వ్యతిరేకత పెరుగుతోంది. 
 
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న రోజా నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుండే రోజాపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తాజాగా రోజాకు సంబంధించిన ఒక ఆడియో టేప్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కేజే కుమార్ షష్టి పూర్తి కార్యక్రమాలకు ఎవరూ హాజరు కాకూడదని ఎవరైనా హాజరైతే వారిపై చర్యలు తీసుకుంటానని రోజా ఆడియోలో చెప్పారు. 
 
షష్టిపూర్తి వేడుకల ఫ్లెక్సీల్లో రోజా ఫోటో లేకపోవడం వలనే రోజా అలా చెప్పారని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నగరి జిల్లాలోని వైసీపీ కార్యకర్తల్లో కూడా రోజాపై కొంత వ్యతిరేకత ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. రోజా కార్యకర్తలను హెచ్చరిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు కూడా రోజాకు నష్టం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం రోజా ఎమ్మెల్యే పదవితో పాటు ఏపీఐఐసీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. 
 
మొదటి కేబినేట్ లోనే రోజాకు మంత్రి పదవి దక్కాల్సి ఉండగా సామాజిక సమీకరణల కారణంగా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. తాజాగా ఆడియో టేపులు బయటకు రావడంతో రోజాకు మంత్రి పదవి కష్టమే అని ప్రచారం జరుగుతోంది. రోజాకు మంత్రి పదవి రాకుండా చేయడం కోసమే ఆడియోలు వైరల్ చేస్తున్నారని తెలుస్తోంది. రోజాకు వైసీపీలోనే కొందరు శత్రువులుగా వ్యవహరిస్తూ ఆమెకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: